రియల్ బాహుబలి అంటే ఇతడేనేమో.. ఏకంగా 548 కేజీల బరువు ఎత్తేశాడు!

సోషల్ మీడియాలో పోస్ట్ అయిన వీడియోలు ఏమాత్రం ఆసక్తికరంగా వున్నా, క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.ఈమధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగింది.

 This Is The Real Baahubali.. He Lifted 548 Kg Weight, He Lifted 548 Kg , Tyres,-TeluguStop.com

అందరికీ దీనిపైన అవగాహన పెరిగింది.చదువు వున్నవారైనా, చదువు లేనివారైనా ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ తప్పనిసరి అయిపోయింది.

దాంతో ఆటోమేటిక్ గానే సోషల్ మీడియా పరిధి పెరిగిపోయింది.దాంతో ప్రపంచం నలుమూలలా వున్న ఆసక్తికరమైనటువంటి విషయాలను జనాలను ఇట్టే తెలుసుకోగలుగుతున్నారు.

ఈ క్రమంలో ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అవును, మీరు విన్నది నిజమే.

ప్రపంచంలోనే అత్యంత బలవంతుడిగా, దృఢకాయుల్లో ఒకరిగా పేరొందిన ఉక్రెయిన్‌కి చెందిన ఒలెక్సి నొవికోవ్‌ తాజాగా మరో రికార్డ్ సాధించాడు.ఏకంగా 548 కిలోల బరువును పైకి లేపి.

ప్రపంచంలోనే అత్యధిక బరువు ఎత్తిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.రెండేళ్ల క్రితం అంటే 2020వ సంవత్సరంలోనే ప్రపంచంలోనే అత్యంత దృఢకాయుడిగా రికార్డు సృష్టించారు ఒలెక్సి.

ఈ ఏడాది కూడా ఆ పోటీలో పాల్గొన్నప్పటికీ ఆయన మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.

అయితే యూరప్‌ ఖండం పరిధిలో మాత్రం అత్యంత దృఢకాయుడు ఒలెక్సియే కావడం విశేషం.

ఇటీవలే అత్యంత బరువు ఎత్తే ఫీట్‌ ను చేసి చూపారు.అత్యంత భారీ ట్రక్కులకు వాడే 8 టైర్లను రాడ్‌ కు చెరోవైపు 4 చొప్పున తగిలించుకుని ఆ బరువును పైకి ఎత్తారు.

వాటన్నింటి మొత్తం బరువు 548 కిలోలు.ఈ ఫీట్‌ కు సంబంధించిన వీడియో రెడ్డిట్‌ వెబ్‌ సైట్లో పోస్ట్‌ చేయగా వైరల్‌ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube