చిన్న ఏజ్ లో హీరో అయిన వాళ్లలో హీరో రామ్ ఒకడు…ఈయన నటించిన మొదటి సినిమా దేవదాసు సినిమా బాక్స్ అఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది.ఇక దాంతో రామ్ ఇండస్ట్రీ లో ఒక మంచి ఎనర్జిటిక్ హీరో గా గుర్తింపు పొందుతూ వరసగా సినిమాలు చేస్తూ ఉన్నాడు…అయితే రామ్ తన సినీ కెరీర్ లో చాలామంది డైరెక్టర్లతో పని చేశారు.
అయితే రామ్ సినీ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్లు ఏ స్థాయిలో ఉన్నాయో ఫ్లాప్ సినిమాలు సైతం అదే స్థాయిలో ఉన్నాయి.ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రామ్ నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే…
ప్రస్తుతం హీరో రామ్ కు కెరీర్ పరంగా బ్లాక్ బస్టర్ హిట్ అవసరం కాగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో హీరో రామ్ నటిస్తున్నారు.దసరా కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.బోయపాటి శ్రీను అఖండ సినిమా తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
బోయపాటి సైతం ఈ సినిమాతో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది…
యంగ్ హీరోలతో బోయపాటి శ్రీను తెరకెక్కించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోలేదు.అక్టోబర్ నెలలో విడుదలైన సినిమాలలో రామ్ హీరోగా నటించి విడుదలైన సినిమాలు ప్రేక్షకులకు భారీ షాకిచ్చాయి.
రామ్ నటించిన సినిమాలైన శివమ్, ఉన్నది ఒకటే జిందగీ( Vunnadhi Okate Zindagi ), హలో గురూ ప్రేమ కోసమే అక్టోబర్ నెలలో రిలీజ్ కావడం గమనార్హం.
ఈ మూడు సినిమాలలో హలో గురు ప్రేమ కోసమే యావరేజ్ గా నిలవగా మిగతా రెండు సినిమాలు ఫ్లాపులుగా నిలిచాయి.అందువల్ల రామ్ ఈసారైనా భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించి రికార్డ్ సృష్టిస్తారేమో చూడాలి.మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలు అన్నీ ఈ సినిమాలో ఉండనున్నాయని తెలుస్తోంది.
రామ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 13 కోట్ల రూపాయల నుంచి 16 కోట్ల రూపాయల రేంజ్ లో తీసుకుంటున్నారు…ఈ ఒక్క సినిమా మీద ఇద్దరి సెంటిమెంట్లు ముడి పడి ఉన్నాయి మరి ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే దసర వరకు వెయిట్ చేయాలి…
.