స్టార్ మా ఛానెల్ లో విజయవంతంగా ప్రసారమవుతున్న బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే నేడు ప్రసారం కానున్న సంగతి తెలిసిందే.బిగ్ బాస్ సీజన్ 4లో మొత్తం 19 మంది కంటెస్టెంట్లు పాల్గొనగా 10 మంది లేడీ కంటెస్టెంట్లు , 9 మంది మేల్ కంటెస్టెంట్లు ఉన్నారు.
గత మూడు సీజన్లలో మేల్ కంటెస్టెంట్ బిగ్ బాస్ విన్నర్ కాగా ఈ సీజన్ లో కూడా మేల్ కంటెస్టెంట్ బిగ్ బాస్ విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
అయితే బిగ్ బాస్ ఓటింగ్ ప్రక్రియపై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యకం అవుతూ ఉంటాయి.
బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందే కొందరు కంటెస్టెంట్లు పీఆర్ టీంలను ఏర్పాటు చేసుకుని ఓట్లు వేయించుకుంటున్నారని కొందరు ప్రేక్షకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ తనీష్ బిగ్ బాస్ షో ఓటింగ్ ప్రక్రియ గురించి మాట్లాడుతూ తన ఇంట్లోనే బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్లకు దొంగ ఓట్లు పడుతున్నాయని చెప్పారు.

తన తమ్ముడు అమ్మ ఫోన్ లాక్కొని వేరే కంటెస్టెంట్ కు ఓట్లు వేశాడని చెప్పారు.తనీష్ తల్లి తన చిన్న కొడుకు దొంగ ఓట్లు వేశాడని తాను వేయాలనుకున్న ఓట్లను వాడు వేసేశాడని చెప్పుకొచ్చారు.బిగ్ బాస్ షో అంటే ప్రేక్షకులకు ఎంత ఆసక్తి ఉందో తనీష్ ఈ విధంగా చెప్పకనే చెప్పేశారు.బిగ్ బాస్ సీజన్ 2 లో టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచిన గత సీజన్ లో బిగ్ బాస్ బజ్ ప్రోగ్రామ్ కు యాంకర్ గా వ్యవహరించారు.
అయితే తనీష్ తన తల్లి, తమ్ముడు ఏ కంటెస్టెంట్ కు ఓట్లు వేశారనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు.శుక్రవారం రాత్రితో ఓటింగ్ ప్రక్రియ ముగియగా అభిజిత్ బిగ్ బాస్ విన్నర్ అయ్యారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.