చక్కెర ఆరోగ్యానికి మంచిది కాదన్న విషయం అందరికీ తెలుసు.చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఎన్నో ఉన్నాయి.
కానీ, దేన్ని ఎంచుకోవాలో అర్థంగాక చక్కెరనే వాడేస్తుంటారు.అయితే చక్కెరకు బదులుగా డేట్స్ సిరప్ వాడితే ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు నిపుణులు.
ఖర్జూరాల నుంచి తయారు చేసే డేట్స్ సిరప్ రుచిగా ఉండటమే కాదు.ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ప్రోటీన్, విటమిన్ బి, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలను సైతం కలిగి ఉంటుంది.
అందుకే డేట్స్ సిరప్ ఆరోగ్యానికి చాలా మేలంటున్నారు.మరి చక్కెర బదులు డేట్స్ సిరప్‌ను వాడితే ఏ ఏ లాభాలను పొందొచ్చో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.
డేట్స్ సిరప్‌లో కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది.అందు వల్ల, చక్కెరకు బదులుగా దీన్ని తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గు ముఖం పడుతుంది.
సాధారణంగా చక్కెరను వాడితే బరువు పెరిగి పోతామన్న ఆందోళన ఉంటుంది.కానీ, డేట్స్ సిరప్‌తో అటు వంటి భయమే అక్కర్లేదు.
నిశ్చింతగా డేట్స్ సిరప్‌ను వాడొచ్చు.అలాగే డేట్స్ సిరప్‌ను వాడటం వల్ల.
అందులోని ఐరన్ కంటెంట్ రక్త హీనత సమస్యను తరిమి కొట్టి నీరసం, అలసట వంటి వాటిని నివారిస్తుంది.
అంతే కాదు, చక్కెరకు బదులుగా డేట్స్ సిరప్‌ను యూజ్ చేస్తే రక్త పోటు స్థాయిలు అదుపులో ఉంటాయి.మెదడు పని తీరు చురుగ్గా మారుతుంది.ఆల్జీమర్స్ వచ్చే రిస్క్ తగ్గు ముఖం పడుతుంది.
రోగ నిరోధక శక్తి రెట్టింపు అవుతుంది.ముఖంపై ముడతలు త్వరగా రాకుండా ఉంటాయి.
జుట్టు ఎదుగుదల బాగుంటుంది.లైంగిక సమస్యలు దూరం అవుతాయి.
మరియు ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలన్నీ కూడా పరార్ అవుతాయి.