టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు చుట్టు ఓటీటీ ప్రతినిధులు చక్కర్లు కొడుతున్నారట.ఆయన వద్ద ఉన్న సినిమాలను దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట.
కొన్ని విడుదల కాని సినిమాలు కూడా ఆయన వద్ద ఉండటంతో భారీ ఆఫర్‌లతో ఆయన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారట.తాజాగా దిల్‌రాజు ‘వి’ అనే చిత్రాన్ని నిర్మించాడు.
నాని 25వ చిత్రంగా రూపొందిన ఆ చిత్రంలో సుధీర్‌బాబు హీరోగా నటించాడు.మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించాడు.
మొదటి సారి నాని విలన్‌గా నటించడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.సినిమాకు 15 కోట్ల మేరకు ఖర్చు అయ్యి ఉంటుందని అంచనా.
ఓటీటీ వారు మాత్రం సినిమాకు ఏకంగా 20 కోట్ల అమౌంట్ ఇస్తామని చెప్పడంతో పాటు, రన్ టైం ను బట్టి అదనపు అమౌంట్‌ను కూడా షేర్ ఇస్తామని ఆఫర్ ఇస్తున్నారట.కాని దిల్‌రాజు మాత్రం వి సినిమాను థియేటర్‌లోనే విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నాడు.
ఈ విషయంలో దిల్‌రాజు నిర్ణయంను మార్చే విధంగా ఆయన్ను కొందరు ఒత్తిడి చేస్తున్నారట.

కరోనా సీజన్‌లో కూడా దిల్‌రాజు చాలా యాక్టివ్‌గా సినిమాల చర్చల్లో పాల్గొంటున్నాడు.ఇప్పటికే రెండు బాలీవుడ్ సినిమాలను నిర్మిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు.సౌత్‌లో సత్తా చాటిన దిల్‌రాజు ఇక బాలీవుడ్‌లో సినిమాల నిర్మాణంకు సిద్దం అయ్యాడు.
ఈ సమయంలో వి సినిమాను విడుదల చేయడం మంచిదని, ఒక భారం నెత్తి నుండి దించేసినట్లుగా అవుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దిల్‌రాజు మాత్రం ప్రస్తుతానికి ఆలోచనల్లోనే ఉన్నాడట.