పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ) ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నుతోందంటూ నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.ఎల్‌ఈటీ ‘స్లీపర్ సెల్స్’ ప్రధాని హత్యకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, ఇప్పటికే నిఘా పెట్టిందని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) పేర్కొంది.

-->లోక్ కల్యాణ్ మార్గ్ నుంచి సౌత్ బ్లాక్‌లో ప్రధాని తన కార్యాలయానికి వెళ్లే మార్గంలో ఎల్ఈటీ డెత్ స్క్వాడ్‌లు రెక్కీ నిర్వహించినట్టు పేర్కొంది.అత్యంత భద్రత ఉండే లుట్యెన్స్ జోన్‌ను ఉగ్రవాద సంస్థ ట్రాక్ చేసిందని వెల్లడించింది.ఈ నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించింది.