తెలంగాణాలో ఒకవైపు చూస్తే.పోలింగ్ తేదీకి పట్టుమని రెండు వారాల గడువు కూడా లేదు.
ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ కారు పార్టీ నాయకులు తీవ్రం గా కస్టపడుతున్నారు.మరో వైపు టీఆర్ఎస్ ను ఓడించడానికి మహాకూటమిలో పార్టీలన్నీ కంకణం కట్టుకుని ఉన్నాయి.
ఈ సమయంలో ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.కొద్ది రోజుల క్రితం టీఆర్ఎస్ ఎంపీ మరికొంతమంది నాయకులు రాహుల్ సోనియా సమక్షంలో కాంగ్రెస్ లో చేరిపోయారు.
తాజాగా మరో షాక్ ఇస్తూ… ఆ పార్టీ కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంఛార్జి పదవికి గొట్టిముక్కల పద్మారావు రాజీనామా చేశారు.తన రాజీనామాకు గల కారణాలను పద్మారావు స్పష్టంగా వెల్లడించలేదు.

పద్మారావుకు కూకట్‌పల్లిలో మంచి జనాదరణ ఉంది.మాధవరం కృష్ణారావు స్థాయిలో ఆయనకు మద్దతుదారులున్నారు.కాబట్టి ఆయన పార్టీని వీడటం కృష్ణారావుకు గట్టి ఎదురుదెబ్బే.అయితే ఈ పరిణామాలు టీడీపీ అభ్యర్థి సుహాసిని కలిసొస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇక పద్మారావు టీడీపీ లో చేరబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.







