ప్రముఖ తెలుగు సినీ నటుడు, దర్శకుడు వెంకీ అట్లూరి గురించి, ఆయన దర్శకత్వం గురించి అందరికీ తెలిసిందే.ఇక తొలిప్రేమ, మిస్టర్ మజ్ను సినిమాల్లో దర్శకత్వం వహించగా మంచి విజయాన్ని అందించాయి.
ఇక ప్రస్తుతం రంగ్ దే సినిమాకు దర్శకత్వాన్ని అందించారు.ఇక ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది.
ఈ సినిమా లో నితిన్, కీర్తి సురేష్ నటీనటులుగా నటించారు.రొమాంటిక్ ప్రేమ కథ తో తెరకెక్కనున్న ఈ సినిమా.ఇటీవలే ట్రైలర్ కూడా విడుదల అయ్యింది.ఈ ట్రైలర్ బాగా ఆకట్టుకోగా ప్రేక్షకులు సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు.సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.
అంతేకాకుండా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుగగా దర్శకుడు వెంకీ అట్లూరి కొన్ని విషయాలు మాట్లాడారు.నితిన్, కీర్తి సురేష్ ఈ సినిమా కథను అంగీకరిస్తారని అనుకోలేదట.

అర్జున్, అను అనే ఈ పాత్రలకు ప్రాణం పోశారని తెలిపారు.ఇక ఈ సినిమాతో మేము ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యామంటూ దర్శకుడు తెలిపారు.లాక్ డౌన్ లో నిర్మాతలు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేనిదని, దేవి గారి నా ఫ్యాన్స్ గా కలిసానంటూ చెప్పారు.అంతే కాకుండా ఆయన కూడా తనకు ఫ్రీడం ఇచ్చి కావలసినట్లు సంగీతం ఇచ్చారని, పీసీ శ్రీరామ్ గారు సినిమా హీరోగా నటించడం నా అదృష్టం అంటూ తెలిపాడు.
ఇక ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణులు ద బెస్ట్ ఇచ్చారని.వెన్నెల కిషోర్ , అభినవ్ చేసిన కామెడీ చక్కగా పండుతుందని, సినిమా చూసి త్రివిక్రమ్ గారు ఇచ్చిన సపోర్ట్ మరువలేను అంటూ కొన్ని విషయాలు పంచుకున్నాడు.