శ్రీదేవి.( Sridevi ) అతిలోకసుందరి గా అందరి ముందు ఎంతో అందం గా చిరునవ్వుతో మాత్రమే కనిపించే నటి.కానీ ఒక్కసారి ఆమె జీవితంలోకి తొంగి చూస్తే ఎంతో వ్యధ ఉంటుంది.అందరికి అన్ని తెలిసిన నోరు మెదపకుండా ఆలా ఉంటారు కానీ శ్రీదేవి జీవితం మొత్తం తెరిచినా పుస్తకమే.
శ్రీదేవి తన నాలుగో ఏటా నుంచే నటిస్తుంది.నిజం చెప్పాలంటే ఏమో ఒక చైల్డ్ లేబర్.
తండ్రి అయ్యప్ప శర్మ ఆమె తల్లిని రెండో పెళ్లి చేసుకొని కుటుంబానికి ఎలాంటి సహాయం చేయకపోతే శ్రీదేవి తల్లి రాజేశ్వరి ఆమెను నటనలో ప్రవేశ పెట్టింది.అందరికి తన కూతురిని పరిచయం చేసి చైల్డ్ ఆర్టిస్ట్ గా( Child Artist ) చాల సినిమాల్లో నటింపచేసి కుటుంబానికి అండగా ఉండేలా చేసింది.

ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి 12, 13 ఏళ్లకే ఆమెను హీరోయిన్ గా మార్చింది.వయసు పైబడిన హీరోలతో కూడా శ్రీదేవి నటించింది అంటే మనం అర్ధం చేసుకోవచ్చు, ఆ రోజు శ్రీదేవి హీరోయిన్( Heroine ) అవ్వడం ఆమె కుటుంబానికి అర్తకంగా ఎంత అవసరం అని.అక్కడ వరకు బాగానే ఉంది.కాస్త ఆమె కుటుంబం ఫైనాన్సియల్ గా బాగా సెటిల్ అయ్యాక పెళ్లి కూడా చేయకుండా రాజేశ్వరి అనారోగ్యానికి గురయ్యింది అప్పటి వరకు రెండో పెళ్లి వాడిని చేసుకోకూడని అనుకున్నప్పటికే బోనీ కపూర్( Boney Kapoor ) అవసరం శ్రీదేవి కుటుంబానికి అవసరం అయ్యింది.
అలా సాన్నిహిత్యం పెరిగి పెళ్లి వరకు వెళ్ళింది.చివరికి శ్రీదేవి తన చెల్లి పెళ్లి చేసింది.కానీ రాజేశ్వరి పోయాక సొంత చెల్లి శ్రీదేవి పై ఆస్థి కోసం కేసు వేసింది.ఆలా కొంత ప్రాపర్టీ ఇచ్చి ఆ గొడవ కోర్ట్ నుంచి విత్ డ్రా చేయించుకుంది.

ఆ తర్వాత భర్త చేసిన అప్పుల బాధ్యత కూడా తీర్చే అవసరం శ్రీదేవి పైనే పడింది.ఈ విషయాలను ఆమె ఎక్కడ ఎవరితోనూ చెప్పకపోయినా అందరికి అన్ని తెలుసు.బోనీ సినిమాలు తీసి లాస్ అయితే మొదటి భార్య కుటుంబం ఉంది, ఆస్తులు ఉన్నాయ్.ఆ రోజు శ్రీదేవి ఎవరికీ వద్దు కానీ ఆ అప్పుల కోసం శ్రీదేవి మళ్లి మొహానికి మేకప్ వేసింది.
సినిమాల్లో నటించి అందరిని సెటిల్ చేసింది.కన్న కూతుళ్లను సెటిల్ చేయకుండానే కన్నుమూసింది.
జీవితం అంత ఒక బానిస లా అందరికి సంపాదించి పెట్టింది.







