ఇటీవల రోజుల్లో అధిక బరువుతో బాధపడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.బరువు పెరగడం వల్ల శరీర ఆకృతి అందవిహీనంగా మారడమే కాదు.
అనేక అనారోగ్య సమస్యలు సైతం తలెత్తుతాయి.అందుకే పెరిగిన బరువును తగ్గించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.
కఠినమైన డైట్స్, వర్కౌట్స్ అలవాటు చేసుకుంటారు.మీరు ఈ లిస్ట్ లో ఉన్నారా.? అయితే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే మూడు రకాల డ్రింక్స్‌ను మీ డైలీ డైట్‌లో చేర్చుకోవాల్సిందే.ఈ డ్రింక్స్ బరువు వేగంగా తగ్గడానికి ఎంతగానో సహాయపడతాయి.
అదే సమయంలో ఎన్నో ఆరోగ్య లాభాలను సైతం అందిస్తాయి.మరి ఇంకెందుకు లేటు ఆ మూడు రకాల డ్రింక్స్ ఏంటో.
వాటిని ఎలా తయారు చేసుకోవాలో.తెలుసుకుందాం పదండీ.
మొదటి డ్రింక్ కోసం.ముందుగా ఒక గ్లాస్ హాట్ వాటర్ ను తీసుకుని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసి ఐదు నిమిషాల పాటు వదిలేయాలి.
ఆపై అందులో రెండు టేబుల్ స్పూన్ల ఉసిరి జ్యూస్, రెండు టేబుల్ స్పూన్ల అల్లం జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ పుదీనా జ్యూస్, చిటికెడు పింక్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ బెల్లం పొడి వేసి బాగా కలిపి.ఉదయాన్నే ఖాళీ కడుపుతో సేవించాలి.
రోజూ ఈ డ్రింక్‌ను తీసుకుంటే వేగంగా వెయిట్ లాస్ అవుతారు.బాడీ డిటాక్స్ అవుతుంది.
మరియు ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రోంగ్ అవుతుంది.
రెండవ డ్రింక్ కోసం.స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో పది తులసి ఆకులు, హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి పది నిమిషాల పాటు మరిగించి.
స్ట్రైనర్ సాయంతో వాటర్‌ను ఫిల్టర్ చేసుకుని రుచికి సరిపడా తేనెను కలపాలి.బ్రేక్ ఫాస్ట్ అనంతరం ఈ డ్రింక్‌ను తీసుకుంటే మెటబాలిజం రేటు పెరుగుతుంది.తద్వారా క్యాలరీలు త్వరగా కరుగుతాయి.మూడొవ డ్రింక్ కోసం.
ఒక బౌల్‌లో కప్పు ఫ్రెష్ పెరుగు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం తురుము, హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, రెండు టేబుల్ స్పూన్ల పుదీనా జ్యూస్, చిటికెడు పింక్ సాల్ట్, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని హ్యాండ్ బ్లెండర్ సాయంతో బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది.ఈ డ్రింక్‌ను లంచ్ సమయంలో తీసుకోవాలి.
ఈ డ్రింక్ కూడా వేగంగా బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది.