సాధారణంగా కొందరికి శరీరం మొత్తం ఒక రంగులో ఉంటే చేతులు ( Hands ) మాత్రం నల్లగా కాంతిహీనంగా కనిపిస్తుంటాయి.అయితే ఎక్కువ శాతం మందిలో ఇందుకు ఎండల ప్రభావం ప్రధాన కారణంగా మారుతుంటుంది.
సూర్యుడి నుండి వచ్చే అతినీలలోహిత కిరణాలకు గురికావడం వల్ల చేతులు నల్లగా తయారవుతుంటాయి.దాంతో చేతుల నలుపును( Dark Hands ) చూసుకుంటూ తెగ వర్రీ అయిపోతుంటారు.
కానీ చింతించవద్దు.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ ఇంటి చిట్కాలను కనుక పాటిస్తే నల్లగా మారిన చేతులను మళ్లీ తెల్లగా మరియు కాంతివంతంగా మెరిపించుకోవచ్చు.
టిప్-1: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు కీర దోసకాయ తురుము,( Cucumber ) రెండు టేబుల్ స్పూన్లు పెరుగు( Curd ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని చేతులకు పట్టించి పది నిమిషాలు పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చేతులను ఐదు నిమిషాల పాటు బాగా స్క్రబ్బింగ్ చేసుకుని అప్పుడు వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ విధంగా కనుక చేశారంటే నలుపు మొత్తం మాయం అవుతుంది.
చేతులు తెల్లగా మృదువుగా మారతాయి.
టిప్-2: ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు చందనం పొడిని( Sandalwood Powder ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) మరియు సరిపడా రోజ్ వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని చేతలకు పూతలా అప్లై చేసుకుని ఆరబెట్టుకోవాలి.
పూర్తిగా డ్రై అయిన తర్వాత వాటర్ తో వాష్ చేసుకోవాలి.ఈ రెమెడీ కూడా నలుపును వదిలిస్తుంది.
చేతులను వైట్ గా, బ్రైట్ గా మెరిపిస్తుంది.
టిప్-3: ఇక నిమ్మరసం మరియు పంచదారను ఉపయోగించి కూడా డార్క్ హాండ్స్ కు బై బై చెప్పవచ్చు.అందుకోసం రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల పంచదారలో మూడు టేబుల్ స్పూన్లు నిమ్మరసం కలపాలి.ఈ మిశ్రమాన్ని చేతులకు అప్లై చేసి సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.
ఐదు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకున్న అనంతరం వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది.