బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు.ఈ రోజు ఆయన ఢిల్లీకి( Delhi ) వెళ్తున్నట్లు సమాచారం.
లగచర్లలో ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తున్న బాధితులు, రైతులతో కలిసి ఎస్సీ, ఎస్టీ కమిషన్ లో( SC, ST Commission ) ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వెళుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తున్న రైతులు, ఫార్మా కంపెనీ బాధితులు ఢిల్లీకి చేరుకున్నారు .ఈరోజు సాయంత్రం కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి రైతులతో కలిసి స్వయంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయనున్నారు.ఇటీవల లగచర్లలో ఫార్మ కంపెనీని( Lagacharla Pharma Company ) వ్యతిరేకిస్తున్న రైతులు ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడికి పాల్పడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ లో ఈ ఘటన జరగడంతో దీనిని ప్రభుత్వం కూడా సీరియస్ గానే తీసుకుంది.ఇప్పటికే ఈ దాడికి పాల్పడిన అనేకమందిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.తమపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఫార్మా బాధితులు ఆందోళన చేపట్టారు.ఈ క్రమంలోనే ఫార్మా బాధితులకు బిఆర్ఎస్ అండగా నిలిచింది.మేరకు ఫార్మా బాధితులతో కలిసి జాతీయ ఎస్సీ , ఎస్టీ కమిషన్ ను కలిసి దీనిపై ఫిర్యాదు చేసి జాతీయస్థాయిలో దీనిని హైలెట్ చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది.
ఈ క్రమంలోనే కేటీఆర్ దీనికి నాయకత్వం వహిస్తూ మానవహక్కుల కమిషన్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన, పోలీసుల పైన ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.ఈ విధంగా రేవంత్ రెడ్డిని( CM Revanth Reddy ) రాజకీయంగా ఇరుకున పెట్టడంతో పాటు , ఆయన సొంత నియోజకవర్గంలోనే ఆయనకు ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందనే విషయాన్ని హైలెట్ చేసేందుకు, రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గ్రాఫ్ తగ్గించేందుకు బీఆర్ఎస్ ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు సిద్ధం అయ్యింది. లగచర్ల ఫార్మా వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడం తో పాటు, కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకత జనాల్లో మరింత పెంచేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేసుకుంటోంది.