గొంతు నొప్పి అని హాస్పిటల్‌కు వెళ్లిన యూఎస్ మహిళకు షాక్‌!

కొంతమంది ప్రజలు ఏదైనా చిన్న అసౌకర్యంతో ఆసుపత్రులకు వెళ్లి తర్వాత ఏదో ఒక షాకింగ్ విషయాన్ని తెలుసుకుంటారు.అమెరికాలోని ఇల్లినాయిస్‌కు( Illinois ) చెందిన 20 ఏళ్ల నర్సింగ్ అసిస్టెంట్ కాట్లిన్ యేట్స్( Katelyn Yates ) కూడా అలాంటి ఒక నమ్మలేనటువంటి విషయం తెలుస్తుంది.

 Illinois Mom Went To The Hospital With A Sore Throat And Discovered She Was Preg-TeluguStop.com

ఈమె గొంతు నొప్పితో ఆసుపత్రికి వెళ్ళింది.గొంతు వాచిపోయి ఉంటుందేమో అని అనుమానించిన వైద్యులు ఎక్స్‌రే తీద్దామని భావించారు.

దానికంటే ముందుగా గర్భం ఉన్నదో లేదో పరీక్ష చేయించారు.ఎందుకంటే గర్భవతులకు ఎక్స్‌రేలు ప్రమాదకరం.

కానీ ఆ పరీక్ష ఫలితం కాట్లిన్‌ను షాక్‌కు గురి చేసింది.ఆమె కేవలం గర్భవతి( Pregnant ) అని తెలియడమే కాదు, నలుగురు పిల్లలు( Quadruplets ) ఆమె కడుపులో పెరుగుతున్నారని తెలిసింది! ఏప్రిల్ ఫూల్స్ డే రోజు ఈ ఆశ్చర్యకరమైన విషయం తెలియడంతో మొదట కేట్లిన్ ఇది ఒక జోక్ అనుకుంది.

కానీ అది నిజమే.

Telugu Rollercoaster, Julian Bueker, Katelyn Yates, Medical Miracle, Premature,

కాట్లిన్‌కు నాలుగు పిల్లలకు జన్మనివ్వబోతుందని తెలిసినప్పుడు ఆమె భర్త జూలియన్ బ్యూకర్( Julian Bueker ) చాలా ఆనందించాడు.కాట్లిన్‌కు ఈ వార్త ఒకింత షాక్‌కి గురి చేసినప్పటికీ జూలియన్‌ ప్రోత్సాహం ఆమెకు ధైర్యం ఇచ్చింది.కాట్లిన్‌ ఆరు నెలల కిందటే జూలియన్‌ను పెళ్లి చేసుకుంది.

అయితే ఈ గర్భం ఆమెకు చాలా కష్టాన్ని కలిగించింది.కాట్లిన్‌కు ప్రీక్లంప్సియా వ్యాధి వచ్చింది.

దీంతో ఆమెకు రక్తపోటు పెరిగి, కాలేయం, మూత్రపిండాలకు ఇబ్బంది కలిగింది.గర్భం ముగింపు దశలో ఆమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో వైద్యులు సిజేరియన్ చేసి నాలుగురు పిల్లలను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చారు.

అక్టోబర్ 17న ఇల్లినాయిస్‌లోని స్ప్రింగ్‌ఫీల్డ్‌లోని సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో ఎలిజబెత్ టేలర్, మాక్స్ ఆష్టన్, ఎలియట్ రైకర్, జ్య గ్రేస్ అనే నలుగురు చిన్నారులు జన్మించారు.

Telugu Rollercoaster, Julian Bueker, Katelyn Yates, Medical Miracle, Premature,

మాక్స్, ఎలియట్ ఇద్దరు ట్విన్స్.వీరిలో ఎలిజబెత్ అతి చిన్నది, ఆమె బరువు కేవలం ఒక పౌండ్ రెండు మాత్రమే ఉంది.అతి పెద్దవాడు మాక్స్, ఆ బరువు రెండు పౌండ్ల ఉన్నాడు.

తక్కువ నెలలకే పుట్టినా నాలుగురు శిశువులు ఆరోగ్యంగా ఉన్నారు.వారు నిత్యం బరువు పెరుగుతున్నారు.వారి పెరుగుదల అద్భుతంగా ఉందని కాట్లిన్‌ ఆశ్చర్యంతో చెప్పింది.“కొన్ని వారాల క్రితం వారు నా చేతి పరిమాణంలో ఉండేవారు” అని ఆమె చెప్పింది.తన కుటుంబాన్ని పోషించడానికి కాట్లిన్‌ వెన్నో ద్వారా దానాలను అభ్యర్థిస్తున్నారు.మాతృ-గర్భ శిశు వైద్య నిపుణురాలు డాక్టర్ మెఘనా లిమాయే మాట్లాడుతూ, ఒకేసారి నలుగురు పిల్లలు జన్మించడం చాలా అరుదు అని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube