టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( allu arjun) ముద్దుల కూతురు గారాల పట్టి అల్లు అర్హ (allu arha)గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.చిన్న వయసులోనే భారీగా అభిమానులను సంపాదించుకుంది అల్లు అర్హ.
అప్పుడప్పుడు అల్లు అర్హకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.బన్నీ భార్య స్నేహ (Sneha)ఎప్పటికప్పుడు తన పిల్లలకు సంబంధించిన ఫన్నీ మూమెంట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది.
తాజాగా కూడా మరోసారి అల్లు అర్హ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలేం జరిగిందంటే.బాలకృష్ణ (BAlakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్(unstoppable) సీజన్ 4కి అల్లు అర్జున్ హాజరైన సంగతి తెలిసిందే.ఇప్పటికే దీనికి సంబంధించిన ఒక ఎపిసోడ్ విడుదలై ఆకట్టుకోగా ఇప్పుడు తాజాగా మరో ఎపిసోడ్ ప్రోమోను ఆహా విడుదల చేసింది.
అందులో బన్ని పిల్లలు అయాన్, అర్హ సందడి చేశారు.అర్హా తెలుగులో పద్యం పాడగా బాలకృష్ణ ప్రశంసించారు.నవంబర్ 22న ఈ ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.ఆ ప్రోమో ని చూసిన అభిమానులు అల్లు అర్హపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇకపోతే అల్లు అర్జున్ విషయానికి వస్తే అల్లు అర్జున్.బన్నీ తాజాగా నటించిన పుష్ప2 (Pushpa-2)సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.డిసెంబర్ 5వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు అల్లు అర్జున్.ఈ ప్రమోషన్స్ లో బాగానే ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం అత్యధిక వ్యూస్ ట్రెండింగ్ అవ్వడంతో పాటు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది ఈ సినిమా ట్రైలర్.