టాలీవుడ్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna)ప్రస్తుతం హోస్టుగా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్(Unstoppable).ఇప్పటికే మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం నాలుగవ సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే.
బాలయ్య బాబు(Balayya Babu) హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు హాజరైన విషయం తెలిసిందే.
మూడు సీజన్లు పూర్తి అయ్యి నాలుగవ సీజన్ నడుస్తున్న కూడా ఇప్పటివరకు ఈ షో కి ఒక్కసారి కూడా ఎన్టీఆర్ ని (NTR)పిలవలేదు.ప్రస్తుతం నాలుగో సీజన్ నడుస్తోంది.

ఆల్రెడీ చంద్రబాబు, సూర్య, అల్లు అర్జున్ (Chandrababu, Surya, Allu Arjun)లాంటి వాళ్లు వచ్చారు. కేవలం ఇంకా కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి.అయినప్పటికీ ఎన్టీఆర్ (Jr.NTR)వస్తాడనే గ్యారెంటీ లేదు.ఎందుకంటే తమది నందమూరి వంశమని చెప్పుకునే బాలకృష్ణకు, ఎన్టీఆర్ (Balakrishna , NTR)కు మధ్య కొన్ని కుటుంబ సమస్యలు ఉన్నాయని,వీటికి అదనంగా రాజకీయ వైరుధ్యాలు కూడా ఉన్నాయని వీటన్నింటినీ దాటుకొని అన్ స్టాపబుల్ లో ఎన్టీఆర్ కనిపించడం అసాధ్యం అంటూ ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.పరిస్థితులు కూడా ఎప్పటికప్పుడు వాటికీ తగ్గట్టుగానే వస్తుండడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం చేకూర్చినట్టు అవుతోంది.

ఇకపోతే తెలుగులో ఇప్పుడు అలాంటిదే మరో టాక్ షో వస్తున్న విషయం తెలిసిందే.ఆ షోకీ రానా (RANA)హోస్ట్ గా చేస్తున్నారు.దాంతో కనీసం రానా అయినా ఎన్టీఆర్ ను పిలుస్తాడా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది.ఒకవేళ రానా పిలిచినా ఎన్టీఆర్(NTR) వస్తాడా అనేది మరో ప్రశ్న కూడా ఉంది.
ఎన్టీఆర్ మాత్రమే కాదు. చిరంజీవి, నాగార్జున(Chiranjeevi, Nagarjuna) లాంటి వాళ్లు కూడా బాలయ్య(Balayya) షోలో కనిపించలేదు.
ఇటు రానా షోలో కూడా వాళ్లు కనిపించలేదు.మరి వీళ్ల ఎంట్రీపై రానా ఏమంటున్నాడు? నా ఇంటర్వ్యూల్లో ఎవరి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయో వాళ్లందర్నీ నా షోకు పిలిచే ఆలోచనలో ఉన్నాను.ఎన్టీఆర్, నాగార్జున, చిరంజీవిని కూడా పిలవాలని ఉంది.కాకపోతే నాకు పరిమిత ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి.సీజన్-1 (Season-1)హిట్టయితే, సీజన్ 2కు (Season-2)మరింత మంది సెలబ్రిటీల్ని పిలుస్తాను అని తెలిపారు రానా.







