సౌత్ ఇండియన్ స్టార్ హీరో లేడీ సూపర్ స్టార్ నయనతార( Nayanatara ) గత మూడు రోజులుగా సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు.ఈమె హీరో ధనుష్ ( Danush ) గురించి సోషల్ మీడియా వేదికగా మూడు పేజీల లేఖ విడుదల చేయడంతో ధనుష్ నయనతార మధ్య వివాదం చెలరేగింది.
నెట్ ఫ్లిక్స్ నయనతార డాక్యుమెంటరీని( Documentary ) రూపొందించిన విషయం మనకు తెలిసిందే.అయితే ఈ డాక్యుమెంటరీలో నయనతార చిన్నప్పటి నుంచి తన జీవితంలో జరిగిన సంఘటనలు అలాగే ఆమె ప్రేమ పెళ్లి పిల్లల గురించి అన్ని విషయాలను వెల్లడించారు.
![Telugu Danush, Documentary, Mahesh Babu, Nayanatara, Maheshbabu-Movie Telugu Danush, Documentary, Mahesh Babu, Nayanatara, Maheshbabu-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/11/Super-star-Mahesh-Babu-react-on-nayanatara-documentaryc.jpg)
ఈ క్రమంలోనే ఈ డాక్యుమెంటరీ కోసం నయనతార ధనుష్ నిర్మించిన చిత్రం నుంచి మూడు సెకండ్ల ఫుటేజ్ తీసుకోవడంతో ధనుష్ అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా 10 కోట్ల రూపాయల లీగల్ నోటీసులను నయనతారకు పంపించారు.ఇక ఈ విషయంపై ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వివాదం నెలకొంది.ఇదిలా ఉండగా ఈ డాక్యుమెంటరీ సోమవారం నుంచి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతుంది.ఇలా ఈ డాక్యుమెంటరీ ద్వారా నయనతార ధనుష్ మధ్య వివాదం చెలరేగుతున్న సమయంలో మహేష్ బాబు( Mahesh Babu ) సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
![Telugu Danush, Documentary, Mahesh Babu, Nayanatara, Maheshbabu-Movie Telugu Danush, Documentary, Mahesh Babu, Nayanatara, Maheshbabu-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/11/Super-star-Mahesh-Babu-react-on-nayanatara-documentaryd.jpg)
ఈ క్రమంలోనే మహేష్ బాబు తాజాగా ఈ డాక్యుమెంటరీని చూశారని తెలుస్తోంది.ఇలా ఈ డాక్యుమెంటరీ చూసిన ఈయన సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించిన పోస్టర్ షేర్ చేస్తూ ఏకంగా మూడు లవ్ ఎమోజీలను షేర్ చేశారు.దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారడమే కాకుండా మహేష్ బాబుకి నయనతార డాక్యుమెంటరీ అంత బాగా నచ్చేసిందా అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు పాపం మహేష్ బాబు సినిమాలు లేక ఖాళీగా కూర్చుని చివరికి ఇలా డాక్యుమెంటరీకి కూడా రివ్యూస్ ఇస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక మహేష్ బాబు త్వరలోనే రాజమౌళి ( Rajamouli ) సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్నారు.
ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే.