హిందూ దేవాలయంలో నమాజ్ చదివిన ముస్లిం వ్యక్తి.. గుడి బయట ఉద్రికత్త (వీడియో)

భిన్నత్వంలో ఏకత్వం అనే సామెతకు సంబంధించి అనేక విషయాలను మనం భారతదేశంలో చాలా సార్లు చూసాము.అయితే ఈ మధ్యకాలంలో పలుచోట్ల భారతదేశంలో కొన్ని మతపరమైన సంఘటనల నేపథ్యంలో వివిధ మతాల వర్గాలకు సంబంధించి పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

 Muslim Man Who Offered Prayers In A Hindu Temple Gets Mobbed Outside The Temple-TeluguStop.com

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మహానగరంలో (metropolis ,Hyderabad ,Telangana)ఈ పరిస్థితి మరి ఘోరంగా తయారైందని చెప్పవచ్చు.కొద్దిరోజుల క్రితం సికింద్రాబాద్(Secunderabad) ప్రాంతంలో అమ్మవారి గుడిలో అమ్మవారి విగ్రహాన్ని ఇష్టానుసారంగా కొట్టి కూల్చి వేసిన ఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మత ఘర్షణలు జరిగాయి.

ఈ నేపథ్యంలో అనేకమంది రోడ్లపై కేటాయించి వారి నిరసనలను తెలిపారు.తాజాగా ఓ ముస్లిం వ్యక్తి దేవాలయంలో నవాజ్ చదివిన ఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలకు వెళ్తే.

హైదరాబాద్(Hyderabad) నగరంలోని నాగోల్ ప్రాంతంలో ఓ ముస్లిం వ్యక్తి (Muslim Man)దేవాలయంలోకి వెళ్లి నమస్కరించి సంఘటన చోటుచేసుకుంది.ధనలక్ష్మి నగర్ చండీ అమ్మవారి ఆలయానికి మాల వేసుకొని ఉన్న ఓ స్వామి వెంట ఓ ముస్లిం వ్యక్తీ అక్కడికి వచ్చాడు.అయితే, ఉన్నట్లుండి అయ్యప్ప పూజ జరుగుతున్న సమయంలో ఆ ముస్లిం వ్యక్తి నమాజ్ చదివాడు.

ఆ సమయంలో తీసిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతనిపై నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వైరల్ అయిన వీడియోలో మొదట ఆ వ్యక్తి గుడిలో నమాజ్ చేస్తుండగా.

ఆ తర్వాత అయ్యప్ప భక్తులు అతనిని వాదించి గుడి బయటకి తీసుకోవచ్చారు.ఆ తర్వాత వారు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ముస్లిం వ్యక్తిని అలాగే అయ్యప్ప స్వామి భక్తుడిని కూడా వారి వెంట తీసుకువెళ్లడంతో అక్కడ పరిస్థితి సద్దుమణిగింది.

పోలీసులు అక్కడ చేరుకునే లోపు అక్కడ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉండేది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube