భుజాల నొప్పి.వినిడానికి చిన్న సమస్యలానే అనిపిస్తుంది.
కానీ, దాని బారిన పడిన వారు మాత్రం నరకం చూసేస్తారు.భుజాల నొప్పితో బాధ పడే వారు ఏ పనీ చేయలేరు.
బరువున్న వస్తువులను పట్టు కోవాలన్నా, చైతులను పైకి ఎత్తాలన్నా, కంప్యూటర్ ముందు పని చేయాలన్నా తెగ ఇబ్బంది పడిపోతుంటారు.భుజాల నొప్పి వేధిస్తుంటే సరిగ్గా నిద్ర కూడా పట్టదు.
ఈ క్రమంలోనే చాలా మంది భుజాల నొప్పిని నివారించుకునేందుకు పెయిన్ కిల్లర్స్‌ను తెగ వాడేస్తుంటారు.
కానీ, ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ పాటిస్తే గనుక.
భుజాల నొప్పిని చాలా త్వరగా మరియు సులభంగా నివారించుకోవచ్చు.మరి ఇంకెందుకు లేటు.
ఆ టిప్స్ ఏంటో ఓ లుక్కేసేయండి.ఎప్సోమ్ ఉప్పు(Epsom Salt).
భుజాల నొప్పిని తగ్గించడంలో అద్భుతంగా సమాయపడుతుంది.బకెట్ హాట్ వాటర్ తీసుకుని అందులో అర కప్పు వరకు ఎప్సోమ్ ఉప్పు వేసి కరిగించండి.
అపై ఈ వాటర్‌తో స్నానం చేయడం.ప్రతి రోజు ఉదయం, సాయం ఇలా చేస్తే కండరాల యొక్క ఒత్తిడి తగ్గి.
రక్త ప్రసరణ మెరుగు పడుతుంది.దాంతో భుజాల నొప్పి పరార్ అవుతుంది.

అలాగే భుజాల నొప్పితో బాధ పడే వారు ఆటలు ఆడటం, బరువైన వస్తువులు ఎత్తడం చేయరాదు.ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి.కండరాలు బలహీనంగా మారడం వల్ల కూడా భుజాలు నొప్పి పుడతాయి.అందుకే కండరాలను బలంగా మార్చే ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలి.
ఐస్ థెరపీ కూడా భుజాల నొప్పిని సమర్థవంతంగా తగ్గించగలదు.ఒక క్లాత్‌లో ఐస్ ముక్కలను చుట్టు భుజాలపై పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉంచుకుంటే.
భుజాల నొప్పి క్రమ క్రమంగా తగ్గిపోతుంది.

పసుపుతోనూ భుజాల నొప్పిని నివారించుకోవచ్చు.ఒక బౌల్ తీసుకుని అందులో మూడు స్పూన్ల పసుపు, నాలుగు స్పూన్ల కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని భుజాలకు అప్లై చేసి.
బాగా డ్రై అయిన తర్వాత వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి.ఇలా ఉదయం, సాయంత్రం చేస్తే భుజాల నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు.