ఎరుపు ఆకుపచ్చ నలుపు ద్రాక్షలలో.. ఏది ఆరోగ్యానికి మంచిది తెలుసా..

సాధారణంగా ఆకుపచ్చ ద్రాక్షను చాలా మంది ప్రజలు ఇష్టంగా తింటూ ఉంటారు.ఇందులో చాలా రకాల పోషకాలు ఉన్నాయి.

 Do You Know Which Red Green Black Grapes Are Good For Health, Grapes , Red Gra-TeluguStop.com

అంతే కాకుండా ద్రాక్షలల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి.కొన్ని రకాలు తీపిగా ఉంటాయి.

మరి కొన్ని రకాలు పుల్లగా ఉంటాయి.ఫ్రూట్ సలాడ్ మరియు పెరుగులో ఆకుపచ్చ ద్రాక్షను ఎక్కువగా ఉపయోగిస్తారు.

ముఖ్యంగా చెప్పాలంటే నల్ల ద్రాక్షాలో చాలా రకాలు ఉంటాయి.నల్ల ద్రాక్ష లో పుల్లని, తీపి కలిగిన రకాలు ఎన్నో ఉన్నాయి.

తరుచుగా జ్యూస్ తయారీలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు.అంతే కాకుండా వైన్ తయారీలో కూడా నల్ల ద్రాక్షను ఎక్కువగా ఉపయోగిస్తారు.

గింజలు లేని నల్ల ద్రాక్షను కూడా మార్కెట్లో పొందవచ్చు.ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి.

ముఖ్యంగా చెప్పాలంటే నల్ల ద్రాక్షలో(Black grapes ) పోషకాలు పుష్కలంగా ఉంటాయి.ఇందులో విటమిన్ కే మరియు విటమిన్ సి కూడా ఉంటాయి.ఈ ద్రాక్ష క్యాన్సర్ కణాలను(Cancer) నివారిస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఎర్ర ద్రాక్ష తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది.ఇది జామ్ మరియు జల్లిని తయారు చేయడానికి ఉపయోగిస్తారు.ఇందులో విటమిన్ సి మరియు విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి.

ముఖ్యంగా చెప్పాలంటే అన్ని రకాల ద్రాక్షలలో పోషకాలు ఎక్కువగానే ఉంటాయి.కానీ నలుపు, ఎరుపు ద్రాక్షలలో మూడు రకాల పాలీఫెనాల్స్ ఉంటాయి.అయితే ఫినోలిక్ యాసిడ్, ఫ్లేవనాయిడ్ మరియు రెస్వెరాట్రాల్.ఇవి ఇన్‌ఫ్లమేషన్‌ ను నివారించడానికి, క్యాన్సర్ కణాలను నివారించడానికి, గుండె ఆరోగ్యానికి(Heart health) ఎంతగానో ఉపయోగపడతాయి.కాబట్టి ఎరుపు, నలుపు ద్రాక్షలలో ఆకుపచ్చ ద్రాక్ష కంటే పోషకాలు కాస్త ఎక్కువగా ఉంటాయి.పోషకాలు ఎక్కువగా ఉన్నాయని నల్ల, ఎరుపు రంగు ద్రాక్షలను అధిక మొత్తంలో తినకూడదు.

ఎందుకంటే ఏ ఆహార పదార్ధమైన తగిన మోతాదులో తినడమే మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube