గత కొన్ని రోజులుగా రాయలసీమ రాజకీయంపై తెలుగుదేశం విపరీతమైన ఫోకస్ పేడుతుంది జగన్ హయాంలో రాయలసీమకు( Rayalaseema ) ఒరిగిందేమీ లేదని, రాయలసీమ ప్రయోజనాలను పరిరక్షించే బాధ్యత తెలుగుదేశానికి మాత్రమే ఉందని తాగునీటి మరియు సాగునీటి ప్రాజెక్టులపై తెలుగు దేశం ప్రభుత్వ హయం లో పెట్టిన ఖర్చు లో కనీసం పది శాతం కూడా ప్రస్తుత ప్రభత్వం ఖర్చు పెట్టలేదని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లు ఇస్తూ సీమవాసులను నాకట్టుకోవడానికి తెలుగుదేశం విపరీతంగా ప్రయత్నం చేస్తుంది .ముఖ్యంగా ఈ జిల్లాల నుంచి ఉన్న 52 అసెంబ్లీ సీట్ల లో గతంలో మూడు సీట్లు మాత్రమే గెలుచుకున్న టిడిపి ఇప్పుడు కనీసం సగం సగం గెలుచుకునే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది.
అయితే ఉన్నట్టుండి రాయలసీమ రాజకీయాల పట్ల తెలుగుదేశం( Telugudesam party ) లో ఇంత సీరియస్నెస్ కనిపించడానికి కారణం జనసేన( Janasena ) అని వార్తలు వస్తున్నాయి.ఉభయగోదావరి జిల్లాలలో మెజారిటీ సీట్లను గెలుచుకునే విధంగా రసవత్తర రాజకీయానికి తెరలేపిన జనసేన అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది.మిగతా జిల్లాలలో పార్టీ పరిస్థితి ఎలాగున్నా ఉభయగోదావరి జిల్లాల వరకు జనసేన దే ఆదిత్యం ఆదిక్యo అనే స్థాయికి రాజకీయ వాతావరణ మారిపోవడంతో ఇక్కడ తగ్గిన సీట్లను రాయలసీమలో అకామిడేట్ చేసుకునే విధంగా టిడిపి అధిష్టానం ప్లాన్ చేస్తుందని అందుకే అక్కడ అధికార వైసీపీతో( YCP ) హోరోహరిగా పోరు నడుపుతుందని వార్తలు వస్తున్నాయి.
అధికార వైసీపీని ఓడించాలంటే పొత్తులు తప్పనిసరిగా నమ్ముతున్నచంద్ర బాబు ( Chandra Babu )ఉభయ గోదావరి జిల్లాలో కచ్చితంగా మెజారిటీ సీట్లను జనసైనికు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినందునే ఎట్టి పరిస్థితులను తమ మ్యాజిక్ షుగర్ కి ఇబ్బంది రాకుండా ఉండటం కోసం రాయలసీమలో కనీసం 15 నుంచి 20 సీట్లు గెలుచుకునే విధంగా వ్యూహాలకు తెరతీసారని అందుకే వైసిపి తో సై అంటే సి అంటూ పోరాటానికి తెర తీశారని తెలుస్తుంది