ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.ఢిల్లీ వ్యాప్తంగా గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోయింది.
ఢిల్లీతో పాటు నోయిడా, గురుగ్రామ్ లలో గాలి నాణ్యత క్షీణించింది.నోయిడాలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 444 పాయింట్లకు చేరింది.
గురుగ్రామ్ లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 391 పాయింట్లు, ఢిల్లీలో 359గా నమోదైంది.గాలిలో దుమ్ము, ధూళి కణాలు విపరీతంగా పెరగడంతో గాలి నాణ్యత లోపిస్తున్నట్లు తెలుస్తోంది.
వాయు కాలుష్యం తీవ్రంగా పెరగడంతో ప్రజలు కళ్లు మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు.







