సీ ఎం పీఠాన్ని తలా రెండున్నరేళ్లు పంచుకోనున్న ఆ రెండు పార్టీలు

ఇటీవల ఏపీ క్యాబినెట్ మంత్రుల పదవులు రెండున్నరేళ్లే ఉంటాయని, మరో రెండున్నరేళ్లు వేరేవారికి అవకాశం ఇస్తామని సి ఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఈ విధానం కొత్తగా ఉందని,అందరినీ తృప్తి పరచడం లో జగన్ అడుగులు వేస్తున్నారని అనుకున్నారు అందరూ.

 Shiv Sena Bjp Shares Maharashtra Chief Minister Post-TeluguStop.com

అయితే ఇప్పుడు మహారాష్ట్ర లో ఏకంగా సీ ఎం పదవిని రెండు పార్టీలు పంచుకోనున్నాయి.అవే శివసేన,బీజేపీ.

సార్వత్రిక ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయగా మంచి ఫలితాలు సాధించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేయాలని నిర్ణయించాయి.

అయితే ఈ ఎన్నికల్లో గెలిస్తే ఇరు పార్టీలు తలా రెండున్నరేళ్లు సీ ఎం పదవిని పంచుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది.

-Telugu Political News

లోక్ సభ ఎన్నికలకు ముందే ఇరు పార్టీలు ఈ మేరకు ఒక అవగాహనకు వచ్చినట్లు శివసేన యువనేత వరుణ్ సర్ దేశాయ్ వెల్లడించారు.అయితే ఈ అంశంపై ఇప్పటివరకు బీజేపీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే,బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ల మధ్య జరిగిన భేటీ లో ఈ మేరకు నిర్ణయించినట్లు తెలుస్తుంది.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అక్టోబర్ మాసంలో జరగనున్నాయి.

అలాంటి ఈ సమయంలో శివసేన యూత్ నేత చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube