ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుని ఆరో రోజు ఆస్పత్రికి చేరడంతో ఆయన దీక్ష ముగిసింది.ఆస్పత్రిలో చికిత్స ముగిసి, పూర్తి ఆరోగ్యవంతుడు అయ్యాక ధిల్లీ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు జగన్.
ఢిల్లీ వెళ్లి ఏం చేస్తారు? రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మోడీని కోరుతారు.తనకు అప్పాయింట్మెంట్ ఇవ్వాలని కోరుతూ జగన్ తరపున పార్టీ ప్రధాని కార్యాలయానికి లేఖ పంపింది.
దీనిపై ప్రధాని ఎలా స్పందిస్తారో.ఒకవేళ జగన్ తనను కలవడానికి అనుమతి ఇచ్చినా ప్రత్యేక ఇస్తానని చెబుతారా? నీ దీక్షకు నేను కరిగిపోయానని అంటారా? పురాణ కాలంలో భక్తులు తపస్సు చేస్తే దేవుడు వరాలు ఇచ్చేవాడు.ఇది పురాణ కాలం కాదు.మోడీకి జగన్ భక్తుడు కాదు.కాబట్టి జగన్ను చిన్నబుచ్చకుండా ప్రత్యేక హోదా ఇచ్చే విషయం పరిశీలిస్తా అనే అవకాశం ఉంది.అప్పుడు జగన్ మీడియా దగ్గర ప్రధాని సానుకూలంగా స్పందించారు అని చెబుతారు.
ఇక హోదా కోసం ఈ నెల 21 వరకు ఆందోళన చేస్తామని వై కా పా నాయకులు చెబుతున్నారు.అంటే రాజధాని శంకుస్థాపనకు ముందు రోజువరకు ఆందోళన చేస్తారన్న మాట.ఆ ప్రభావంతో శంకుస్థాపన కార్యక్రమంలో మోడీ హోదా మీద ప్రకటన చేయవచ్చని వై కా పా నాయకులు ఆశ పడుతుండ వచ్చు.ఇక కాంగ్రెస్ పెద్ద నాయకుడు దిగ్విజయ్ సింగ్ జగన్ పోరాటానికి మద్దతు పలికారు.
అంటే పార్టీ పరంగానే మద్దతు ఇచ్చారని అర్థం.జగన్తో తమకు విభేదాలు ఉన్నా మద్దతు ఇస్తున్నామని చెప్పారు.
ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో హామీ ఇచ్చింది ఆనాటి యూపీఏ ప్రభుత్వమే కదా.







