దోమను చంపాలనుకున్నాడు.. కానీ కాలు విరిగి ఆసుపత్రిలో చేరాడు

దోమల( Mosquito ) వల్ల అనేక వ్యాధులు వస్తాయి.అందులో డెంగ్యూ, మలేరియా.

 He Wanted To Kill A Mosquito.. But Broke His Leg And Was Admitted To The Hospita-TeluguStop.com

చికెన్ గున్యా లాంటివి ఉంటాయి.డెంగ్యూ అనేది ప్రమాదకరమైనది.

అలాగే డెంగ్యూ జర్వం వల్ల శరీరంలో ప్లేట్‌లెట్స్ పడిపోతాయి.దీని వల్ల మనిషి బాగా వీక్ అయిపోతాడు.

ఈ సమయంలో కొత్త పేట్ లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది.అలాగే ట్రీట్‌మెంట్‌కు చాలా ఖర్చు అవుతూ ఉంటుంది.

దీంతో దోమలను అరికట్టడానికి, వాటి నుంచి తప్పించుకోవడానికి ఇంట్లో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.దోమతెరలు వాడటం, కాయిల్స్ వాడటం లాంటివి చేస్తూ ఉంటారు.

అలాగే దోమల బ్యాట్ లాంటివి ఉపయోగిస్తూ ఉంటారు.

అలాగే దోమల బారి నుంచి తప్పించుకోవడానికి అనేక రకాల క్రీములు కూడా మార్కెట్ లో వచ్చాయి.వీటిని శరీరానికి రాసుకుంటే దోమలు దరిచేరవు.అయితే దోమ కనిపించగానే మనం చంపేస్తూ ఉంటాం.

కొంతమంది చేతితోనే చంపేస్తూ ఉంటారు.అలా ఒక వ్యక్తి చేతితో దోమను చంపేయబోగా బొక్క విరిగింది.

కాలు మీద దోమ కుడుతుందని ఒక వ్యక్తి సుత్తితో కొట్టాడు.దీంతో దోమ చనిపోగా.

కాలు మీద సుత్తి గట్టిగా తగలడంతో రక్తస్రావమై గాయాలపాలయ్యాడు.చికిత్స కోసం ఆస్పత్రి( Hospita )లో చేరగా.

వైద్యులు స్కానింగ్ చేశారు.

అయితే సుత్తి గట్టిగా తగలడంతో కాలులోని ఎముక విరిగిపోయినట్లు ఎక్స్‌రేలో కనిపించింది.చిన్న దోమను చంపడానికి ఇలా కాలులోని ఎముకను విరగొట్టుకున్నాడు.దీంతో ఇతడి చేసిన తెలివి తక్కువ పనికి నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్ లో ఈ వీడియో షేర్ చేవుతోంది. ఆగస్టు 6న వీడియోను పోస్ట్ చేయగా.

ఇప్పటివరకు 87 లక్షల మంది వీక్షించారు.అలాగే 2 లక్షల 90 వేల లైక్ లు కూడా వచ్చాయి.అలాగే కామెంట్స్ కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి.మూర్ఖత్వంతో ఆలోచించి కాలు విరగొట్టుకున్నాడని కొంతమంద అంటుండగా.ఏ పనిని ఆవేశంతో ఆలోచించి చేయకూడదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube