తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) శనివారం ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ డిబేట్ లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం జగన్( cm jagan ) నుంచి తనకి అభినందన ఫోన్ కాల్ కూడా రాలేదని అన్నారు.నాకు వ్యక్తిగతంగా వైయస్ జగన్ తో ఎలాంటి ఇబ్బంది లేదు.
నాకు ప్రత్యర్థి అని కూడా అనుకోవడం లేదు.రాహుల్ ప్రధాని కావాలి అని నేను, మోడీ ప్రధాని కావాలని ఆయన.మా లక్ష్యాలే వైరుధ్యంగా ఉన్నాయి.
అయితే నాకు కర్ణాటక, తమిళనాడు( Karnataka, Tamil Nadu ) ఎంతో ఏపీ కూడా అంతే అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.వాటి మీద అక్కడ కాంగ్రెస్ స్పందిస్తుంది అని అన్నారు.ఇక ఇదే ఇంటర్వ్యూలో గత ప్రభుత్వం మండలాలు జిల్లాలు ఇష్టానుసారంగా విభజించింది అని సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేశారు.తెలంగాణలో ప్రస్తుతం 33 జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అంశంపై ఉన్నత స్థాయి కమిషన్ ను ఏర్పాటు చేస్తాం.సుప్రీం… హైకోర్టు రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన రెవిన్యూ ఉన్నతాధికారులతో కమిషన్ ఏర్పాటు చేస్తాం.సమగ్ర అధ్యయనం తర్వాత కమిషన్ సిఫారసుల మేరకు జిల్లాలను హేతుబద్దీకరీస్తాం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.