ఆరోగ్యానికి మంచిదని రోజు ఓట్స్ తింటున్నారా? అయితే మీ శరీరంలో వచ్చే మార్పుల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.ప్రతి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా తీసుకోవాలి.
బ్రేక్ ఫాస్ట్ లో నూనె పదార్ధాలు,కొవ్వు ఉండే పదార్ధాలు తీసుకుంటే ఆరోగ్యానికి చెడు చేస్తాయి.అందువల్ల రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు.వాటి గురించి తెలుసుకుందాం.
చర్మంఉదయం సమయంలో ఓట్స్ తినటం వలన చర్మానికి చాలా మంచిది.ఓట్స్ లో ఉండే విటమిన్లు, మినరల్స్ ఎగ్జిమా, దద్దుర్లు రాకుండా కాపాడతాయి.ఓట్స్ లో ఉండే జింక్ చర్మాన్ని శుభ్రం చేస్తుంది.ఓట్స్ లో ఉండే ఐరన్ చర్మ కణాలను కాంతివంతం చేస్తుంది.
ఓట్స్‌లో ఉండే మెగ్నిషియం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది.చనిపోయిన చర్మ కణాల స్థానంలో కొత్త కణాలు ఏర్పడేలా చేస్తుంది.
కండరాలుఓట్స్లో ఉండే ప్రోటీన్లు కండరాలకు బలాన్ని అందిస్తాయి.ఓట్స్ లో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, గ్లూటమైన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండుట వలన కండరాలకు మరమత్తు చేయటమే కాకుండా కొత్త కండరాలు ఏర్పడేలా చేస్తాయి.8 టేబుల్ స్పూన్ల ఓట్స్‌ను తింటే చాలు మనకు రోజు మొత్తంలో అవసరమైన ప్రోటీన్‌లో 15 శాతం వరకు అందుతుంది.
యాంటీ ఆక్సిడెంట్స్ఓట్స్ లో సమృద్ధిగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ దురదలు, వాపులు, హైబీపీని తగ్గిస్తాయి.
ఓట్స్‌లో ఉండే బీటా గ్లూకాన్ రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది.దీంతో మధుమేహం అదుపులో ఉంటుంది.

శక్తిఓట్స్లో పిండి పదార్థాలు సమృద్ధిగా ఉండుట వలన శరీరానికి అవసరమైన శక్తిని అందించి రోజంతా ఉషారుగా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.
అధిక బరువుఓట్స్ తినటం వలన మెటబాలిజం ప్రక్రియ మెరుగుపడి బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఎక్కువ సేపు కడుపు నిండిన భావన ఉండటం వలన తొందరగా ఆకలి వేయదు.దాంతో బరువు తగ్గుతాము.
కొలస్ట్రాల్ఓట్స్లో ఉండే బీటా గ్లూకాన్ అనే ఫైబర్ చెడు కొలస్ట్రాల్ తగ్గిస్తాయి.ఓట్స్‌లో ఉండే లినోలీక్ యాసిడ్, ఫైబర్‌లు రక్తంలో ఉండే ట్రై గ్లిజరిడ్స్, చెడు కొలెస్ట్రాల్‌లను తగ్గించి రక్తనాళాలను శుద్ధి చేస్తాయి.
దాంతో గుండె పోటు వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి.