సినీ ఇండస్ట్రీలో పరిస్థితులు రోజురోజుకూ మారుతున్నాయి.ఇది వరకు మన ప్రాంతీయ బాషా చిత్రాలు కేవలం మన రాష్ట్రంలో రిలీజ్ అయ్యేవి.
మహా అయితే స్టార్ హీరోలు నటించిన సినిమాలు మాత్రం పక్క రాష్ట్రాలలో విడుదల అయ్యేవి.కానీ ఇప్పుడు అలా కాదు స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా బాట పట్టారు.
దీంతో మన సౌత్ సినిమాలు బాలీవుడ్ ను సైతం దాటుకుని రాణిస్తున్నాయి.
వారి ఇండస్ట్రీలో వారి సినిమాలను వదిలేసి మరీ మన సౌత్ సినిమాలను చూసేందుకు అక్కడి ప్రేక్షకులు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
అందుకే మన సౌత్ సినిమాలు బాలీవుడ్ లో సంచలనాలు సృష్టిస్తున్నాయి.ఇంకా ఇంకా మన సౌత్ నుండి భారీ సినిమాలు నిర్మిస్తూనే ఉన్నారు.వరుసగా రిలీజ్ అవుతూ సంచలనాలు క్రియేట్ చేస్తూనే ఉన్నాయి.

ఈ క్రమంలోనే తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Thalapathy Vijay) కూడా లియో (LEO Movie) సినిమాతో పాన్ ఇండియా రేస్ కు సిద్ధం అవుతున్నాడు.ఈ సినిమాతో ఈయన భారీ టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది.లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రజెంట్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది.
ఈ సినిమా రిలీజ్ ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

ఈ సినిమా మీద ఉన్న నమ్మకంతో లియో సినిమాతో వెయ్యి కోట్ల మార్క్ ను టచ్ చేయాలనీ విజయ్ టార్గెట్ పెట్టుకున్నట్టు టాక్.అందుకే రిలీజ్ కు ముందే 300 కోట్ల బిజినెస్ చేయాలన్నది మేకర్స్ ఆలోచన అట.ఇప్పటి వరకు తమిళ్ ఇండస్ట్రీలో (Kollywood) 1000 కోట్ల మార్క్ టచ్ (1000 Crore Target) చేసిన సినిమా లేదు.మరి విజయ్ తన టార్గెట్ ను రీచ్ అయ్యి సంచలనం క్రియేట్ చేస్తాడో లేదో చూడాలి.








