కళ్ళ చుట్టూ నల్లటి వలయాలా.. క్యారెట్ తో చెక్ పెట్టండిలా!

ముఖ అందాన్ని పాడు చేసే వాటిలో నల్లటి వడియాలు ముందు వరుసలో ఉంటాయి.ఒత్తిడి, కంటినిండా నిద్ర లేకపోవడం, పలు రకాల మందులు వాడకం, జీవనశైలిలో మార్పులు తదితర కారణాల వల్ల కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడ‌తాయి.

 How To Get Rid Of Dark Circles With Carrot! Carrot, Carrot Cream, Carrot Benefit-TeluguStop.com

ఇవి ముఖంలో మెరుపును దూరం చేస్తాయి.చర్మం ఎంత తెల్లగా మృదువుగా ఉన్నా కూడా నల్లటి వలయాలు ముఖాన్ని కాంతిహీనంగా చూపుతాయి.

ఈ క్రమంలోనే నల్లటి వలయాలను వదిలించుకునేందుకు రకరకాల క్రీములు, సీరంలు వాడుతుంటారు.అయితే పైసా ఖర్చు లేకుండా న్యాచురల్ గా కూడా నల్లటి వలయాలను వదిలించుకోవచ్చు.

అందుకు క్యారెట్ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం క్యారెట్ తో నల్లటి వలయాలకు ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసుకుందాం పదండి.

Telugu Tips, Carrot Benefits, Carrot Cream, Dark Circles, Darkcircles, Latest, S

ముందుగా ఒక చిన్న క్యారెట్( Carrot ) ను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలు మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు క్యారెట్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ వాసెలిన్ వేసుకోవాలి.ఇప్పుడు ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో ఉంచి వాసెలిన్ పూర్తిగా మెల్ట్ అయ్యేవరకు హీట్ చేయాలి.

Telugu Tips, Carrot Benefits, Carrot Cream, Dark Circles, Darkcircles, Latest, S

ఆ తర్వాత హీట్ చేసిన మిశ్రమాన్ని చల్లార పెట్టుకుని.ఆపై అందులో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ ( Aloe vera gel)వేసుకుని బాగా మిక్స్ చేస్తే ఒక క్రీమ్ సిద్ధం అవుతుంది.ఈ క్రీమ్ ను బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు తయారు చేసుకున్న క్రీమ్ ను కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని కనీసం ఐదు నిమిషాల‌ పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

ఈ విధంగా నిత్యం చేశారంటే నల్లటి వలయాలు క్రమంగా మాయమవుతాయి.డార్క్ సర్కిల్స్ ( Dark Circles )ను వదిలించడానికి ఈ క్యారెట్ క్రీమ్‌ ఎంత ఉత్తమంగా సహాయపడుతుంది.

కాబట్టి తప్పకుండా ట్రై చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube