రావు గోపాలరావు.కోటా శ్రీనివాసరావు.
తెలుగు సినిమా పరిశ్రమలో విలక్షణ నటులు.అప్పట్లో వీరిద్దరి మధ్య ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.
ఓసారి రావు గోపాలరావును కోటా శ్రీనివాసరావును రూం క్లీనర్ అనుకుని విసుక్కున్నాడు.ఇంతకీ ఎప్పుడు ఈ ఘటన జరిగిందో తెలుసుకుందాం.
అల్లరి అల్లుడు సినిమా షూటింగ్ హైదరాబాద్ లో కొనసాగుతుంది.రావు గోపాలరావు ఈ సినిమాలో కీరోల్ చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ కోసం ఆయన మద్రాసు నుంచి హైదరాబాద్ కు వచ్చాడు.ప్రశాంత్ కుటీర్ అనే హోటల్లో దిగాడు.
అప్పట్లో సినిమా వాళ్లంతా ఇదే హోటల్ కు వచ్చేవారు.ఈ హోటల్లోకి రాగానే కోటా కూడా ఇదే హోటల్లో ఉన్నాడని ఎవరో చెప్పారట.
ఆయనను కలుద్దామని గోపాలరావు వెళ్లి తన రూం కాలింగ్ బెల్ కొట్టాడు.కోటా చాలా విసుగ్గా.
టవల్ చుట్టుకుని డోర్ ఓపెన్ చేశాడు.ఎదరుగా గోపాలరావు కనిపించాడు.
అయ్యో గురువు గారూ మీరా.నేను రూమ్ క్లీనర్ అనుకున్నాను.
అంటూ వెంటనే వెళ్లి బట్టలు వేసుకుని వచ్చి.తన రూంలోకి రమ్మని ఆహ్వానించాడు.
రావుగోపాలరావుకు మర్యాదపూర్వకంగా కుర్చీవేసి కూర్చోబెట్టాడు.పలు విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు.గోపాలరావు కాసేపు మౌనంగా కూర్చున్నాడు.కోటయ్యా.
నిన్ను చూడాలని వచ్చాను.నీకు ఓకే అయితే రెండు మాటలు మాట్లాడి వెళ్తాను అని చెప్పాడు.
అయ్యో మీరు పిలిస్తే నేనే వచ్చేవాడిని సర్.అన్నాడు.ఎందుకంటే కోటా సినిమా పరిశ్రమలోకి రాకముందు నుంచే గోపాలరావు ప్రముఖ నటుడిగా ఉన్నాడు.అందుకే ఆయనంటే కోటాకు ఎంతో గౌరవం.అందుకే హోటల్లో ఆయనను కుర్చీలో కూర్చోబెట్టి.తను కింద కూర్చుంటాడు.

కానీ గోపాలరావు.కోటాను పైకిలేపి కుర్చీలో కూర్చోబెట్టాడు. కోటా వద్దని వారించిన వినలేదు.కోటయ్యా.నువ్వు చాలా గొప్ప నటుడివయ్యా.మా కుటుంబ సభ్యులంతా నీ అభిమానులు అని చెప్పాడు.
సినిమా పరిశ్రమలో నీవు మంచి స్థాయికి చేరుకుంటావు.మంచి ఫ్యూచర్ ఉందని చెప్పాడు.
నీ నటన, డైలాగులు చెప్పే విధానం చాలా బాగుంటుందని మెచ్చుకున్నాడు.చాలా కాలం సినిమా పరిశ్రమలో ఉండాల్సిన వాడివి.
ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో అన చెప్పి వెళ్లబోయాడు.వెంటనే కోటా లేచి తన కాళ్లకు నమస్కరించాడు.
తన ఆశీర్వాదం తీసుకున్నాడు.ఆయన వెళ్తుంటే అభిమానంతో అలాగే చూస్తూ ఉండిపోయాడు కోటా.