టాలీవుడ్ హీరో నందమూరి నటసింహం బాలయ్య బాబు ( Nandamuri Natasinham Balayya Babu )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలయ్య బాబు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.
గత మూడు సినిమాలతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న బాలయ్య బాబు ఇప్పుడు అదే ఊపుతో మరిన్ని సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.కాగా బాలయ్య బాబు చివరగా భగవంత్ కేసరి( Bhagwant Kesari ) సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు డాకు మహారాజ్ ( Daku Maharaj )సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు బాలయ్య బాబు.ఈ సినిమా జనవరి 12వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు మూవీ మేకర్స్.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అదేమిటంటే.లేటెస్ట్ గా డాకు మహారాజ్ యూఎస్ లో బుకింగ్స్ ని ఓపెన్ చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతానికి ఇరవై తొమ్మిది ఏరియాల్లో,డెబ్భై ఏడు షో లకి సంబంధించి బుకింగ్స్ మొదలవ్వగా, టికెట్స్ అన్ని హాట్ కేకుల్లా సేల్స్ అయినట్టు తెలుస్తోంది.మరి కొన్ని చోట్ల కూడా బుకింగ్స్ ఓపెన్ చేయబోతున్నారని, దీంతో బాలకృష్ణ యుఎస్ లో సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.కాగా డాకు మహారాజ్ సినిమా కోసం నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.ఇక ట్రైలర్ రిలీజ్ తో పాటు ప్రీ రిలీజ్ కూడా త్వరలోనే అభిమానుల సమక్షంలో ఘనంగా జరగనుంది.
ఈ సినిమా విడుదల తర్వాత బాలయ్య బాబు అఖండ 2 సినిమాలో నటించనున్నారు.గతంలో విడుదల అయినా అఖండ పార్ట్ 1 కీ సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.