కిడ్నీలకు అండగా కొత్తిమీర.. ఇలా తీసుకుంటే ఊహించని ఆరోగ్య లాభాలు మీ సొంతం!

కొత్తిమీర( Coriander ).వంటలకు చక్కని రుచి, ఫ్లేవర్ ను అందించడంలో దీనికి సాటి మరొకటి లేదు.

ఎక్కువ శాతం మంది కొత్తిమీరను కేవలం నాన్ వెజ్ వంటలకు, బిర్యానీ తయారీలో మాత్రమే ఉపయోగిస్తుంటారు.

కానీ కొత్తిమీరలో మన ఆరోగ్యానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.అనేక జబ్బులకు చెక్ పెట్టే సామర్థ్యం కొత్తిమీరకు ఉంది.

ముఖ్యంగా కొత్తిమీరను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే ఊహించని ఆరోగ్య లాభాలు( Health Benefits ) మీ సొంతం అవుతాయి.

"""/" / ముందుగా అర కప్పు తరిగిన కొత్తిమీర ని తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు వాటర్ తో పాటు క‌డిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి.

అలాగే చిన్న అల్లం ముక్క( Ginger ) కూడా వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత ఆ వాటర్ ను ఫిల్టర్ చేసుకుని కొంచెం తేనె కలిపి సేవించాలి.

ఈ విధంగా కొత్తిమీరను నిత్యం తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.కిడ్నీలకు కొత్తిమీర అండగా ఉంటుంది.

పైన చెప్పిన విధంగా కొత్తిమీర వాటర్ ను తయారు చేసుకుని రోజూ తీసుకుంటే మూత్రపిండాల్లో పేరుపోయిన మ‌లినాలు తొలగిపోయి.

శుభ్రంగా ఆరోగ్యంగా మారుతాయి.కిడ్నీ సంబంధిత వ్యాధులు( Kidney Problems ) దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

"""/" / నెలసరి సమయంలో చాలామంది మ‌హిళలు కడుపునొప్పి, నడుము నొప్పి, తలనొప్పి, కాళ్లు లాగడం వంటి వాటితో సతమతం అయిపోతుంటారు.

అయితే ఈ కొత్తిమీర వాటర్( Coriander Water ) ను తీసుకుంటే ఆయా సమస్యలన్నీ పరార్ అవుతాయి.

నెలసరి తేలికగా అయిపోతుంది.కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

అందువల్ల కొత్తిమీర మరిగించిన వాటర్ ను తీసుకుంటే ఇమ్యూనిటీ సిస్ట‌మ్‌ బూస్ట్ అవుతుంది.

జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఉంటే దూరం అవుతాయి.కొంతమంది కడుపులో మంట అంటూ తరచూ ఇబ్బంది పెడుతుంటారు.

అయితే అలాంటి సమయంలో ఒక గ్లాసు మజ్జిగ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర రసంతో పాటు వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon Juice ) ను మిక్స్ చేసి తాగాలి.

ఇలా తీసుకుంటే కడుపులో మంట చిటికెలో మాయమవుతుంది.

సినిమాల్లో హీరోలను చూసి ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చిన వారు వీరే !