పవన్ ను కొత్త రూట్లో టార్గెట్ చేస్తున్న వైసీపీ ?

వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై ( Pawan Kalyan ) ఇప్పటి వరకు విమర్శలు చేసిన వైసీపీ నాయకులు అకస్మాత్తుగా తమ వైఖరిని మార్చుకున్నారు.పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తూనే, టిడిపి అధినేత చంద్రబాబును( Chandrababu Naidu ) టార్గెట్ చేసుకున్నారు.

 Ycp Leaders Targeting Janasena Pawan Kalyan And Chandrababu Naidu Details, Pavan-TeluguStop.com

పవన్ కళ్యాణ్ చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే వైసీపీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారని, పవన్ చేస్తున్న ఆరోపణలన్నీ చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం ఆయన ఇంటి నుంచే వస్తున్నాయని వైస్పీనేతలు ఆరోపిస్తున్నారు.కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఏపీ మంత్రి ఆర్కే రోజా కూడా ఇదే విధంగా పవన్ పై విమర్శలు చేశారు.

Telugu Ap, Chandrababu, Cm Jagan, Janasena, Janasenapawan, Janasenani, Pavan Kal

ఎమ్మెల్యే కావాలని, అసెంబ్లీలో అడుగు పెట్టాలని మొదటి రోజు పవన్ చెప్పిన దగ్గర నుంచి, ప్రజలు తమ పార్టీని గెలిపిస్తే సీఎం అవుతానని పవన్ చేసిన ప్రసంగాలు అన్ని తెరవెనుక టిడిపి చెప్పించినవేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.చంద్రబాబు వ్యూహం ప్రకారం తనను తిట్టేందుకు కత్తిపూడి, పిఠాపురం, కాకినాడ రూరల్ లో పవన్ సభలు పెట్టారని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి( Dwarampudi Chandrasekhar Reddy ) విమర్శించారు.కాపు, రెడ్డి సామాజిక వర్గాలు ఇక్కడ చాలా సఖ్యంగా ఉంటాయని, తనపై వ్యాఖ్యలకు జనం తిరగబడితే ఒక రెడ్డి ఎమ్మెల్యే ఈ విధంగా చేశారని కాపులను ఎగదోసేందుకు చంద్రబాబు, పవన్ కుట్ర పన్నారని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు.

Telugu Ap, Chandrababu, Cm Jagan, Janasena, Janasenapawan, Janasenani, Pavan Kal

చిరంజీవిని ఏ విధంగా లాగి పడేశారో పవన్నీ అదే విధంగా లాగేస్తారని మంత్రి రోజా( Minister Roja ) అన్నారు.చంద్రబాబు మోసం చేస్తాడని చిరంజీవి 2013 లోనే పవన్ కళ్యాణ్ కి చెప్పాడని, ఇప్పటికైనా మీ అన్నయ్య మాట విని షూటింగ్స్ చేసుకుంటే ఆర్టిస్టుగా అందరూ గౌరవిస్తారని రోజా అన్నారు.పవన్ ఇదే విధంగా చేస్తే అటు రాజకీయాలకు, ఇటు సినిమాలకు కూడా దూరం కావాల్సి ఉంటుంది అని రోజా హితవు పలికారు.

ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలతో తమకు సంబంధం లేదనట్లు గా టిడిపి వ్యవహరిస్తుండడంతో వైసీపీ నాయకులు టీడీపీ, జనసేన కు ముడి పెట్టి ఇప్పుడు విమర్శలు మొదలుపెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube