శరీర శుభ్రతలో మరియు శరీరానికి ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని అందించడంలో స్నానం( Bath ) అనేది చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.నిత్యం స్నానం చేయడం వల్ల శరీరంపై ఉన్న మురికి, చెమట, ధూళి తొలగిపోతాయి.
చర్మం పరిశుభ్రంగా మారుతుంది.అలసట తగ్గి శరీరం శక్తివంతంగా తయారవుతుంది.
రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
ఇలా స్నానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి.ఈ విషయం పక్కన పెడితే.
స్నానం చేసిన వెంటనే తెలిసో తెలియకో కొందరు కొన్ని కొన్ని తప్పులు చేస్తుంటారు.అవి ఆరోగ్యానికి హానికరంగా మారుతుంటాయి.
ఆ నేపథ్యంలోనే స్నానం చేసిన వెంటనే అస్సలు చేయకూడని పనులు ఏంటి.? అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

కొందరు స్నానం చేసిన వెంటనే ఏసీ రూమ్‌లోకి( AC Room ) దూరేస్తుంటారు.ఈ అలవాటు మీకు ఉందా.? అయితే దాన్ని వదులుకోండి.వేడి నీటితో స్నానం( Hot Water Bath ) చేసిన వెంటనే ఏసీ గదిలోకి వెళ్లడం వల్ల జలుబు, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తవచ్చు.
అలాగే స్నానం చేసిన వెంటనే టీ, కాఫీలు( Tea Coffee ) తాగరాదు.స్నానం చేసిన వెంటనే ఇటువంటి వేడి వేడి పానీయాలు తీసుకోవడం శరీర ఉష్ణోగ్రతను ప్రభావితం చేయవచ్చు, దాని ఫలితంగా మానసిక అసౌకర్యం కలగవచ్చు.

స్నానం చేసిన వెంటనే చేయకూడని పనుల్లో భోజనం చేయడం ఒకటి.బాత్ చేసిన వెంటనే భారీగా భోజనం చేశారంటే జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది.అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి.రాత్రుళ్లు స్నానం చేసిన వెంటనే నిద్రపోయే అలవాటు కొందరికి ఉంటుంది.కానీ ఇలా చేయకూడదు.స్నానం తర్వాత శరీర ఉష్ణోగ్రత మారుతుంది.
అందువల్ల వెంటనే నిద్రిస్తే రక్తప్రసరణ మందగించి మానసిక సమస్యలు తలెత్తవచ్చు.
ఇక స్నానం చేసిన వెంటనే వ్యాయామం కూడా చేయకూడదు.
స్నానం తర్వాత శరీరం రిలాక్స్ మోడ్‌లో ఉంటుంది.వెంటనే శ్రమకరమైన వ్యాయామం చేస్తే అలసట, నీరసం ఏర్పడవచ్చు.
అలాగే వ్యాయామం చేసిన వెంటనే కూడా స్నానం చేయకూడదు.కనీసం పదిహేను నుంచి ముప్పై నిమిషాల గ్యాప్ ఇచ్చి స్నానం చేయాలి.