ఇద్దరు యువకులు అమెరికాలో బిజీ బిజీగా ఉండే రోడ్డుపై చేసిన అల్లర్లు చివరికి అరెస్ట్ వరకూ తీసుకు వెళ్ళాయి.రద్దీ గా ఉండే రోడ్లపై ఒక్క నిమిషం పాటు అందరిని స్టన్ అయ్యేలా చేయాలనుకున్నారో ఏమో కాని అనుకున్నది మాత్రం సాధించారు.
ఇంతకీ ఆ యువకులు ఏమి ఘనకార్యం చేశారనే కదా మీ సందేహం.అక్కడికే వస్తున్నా…వాళ్ళు చేసిన పని వింటే హవ్వా అనుకుంటారు.
అమెరికాలో మిచిగాన్ హైవే రద్దీగా ఉంటుంది.ఒక్క చోట వెహికల్ ఆగిపోయిందంటే ట్రాఫిక్ జామ్ చాలా ఘోరంగా ఉంటుంది.అలాంటి చోట ఒక్క సారిగా డిజిటల్ సైన్ బోర్డ్ లపై ప్రచార వీడియోలకి బదులుగా అశ్లీల చిత్రాలు కనిపించడంతో ఒక్క సారిగా ప్రయాణికులు షాక్ అయ్యారు.దాంతో ఎవరికీ వారూ ఛి ఛి అంటూనే నోళ్ళు వెళ్ళబెట్టుకుని చూస్తున్నారు.
ఈ పరిణామంతో ఖంగుతిన్న పోలీసులు పరుగు పరుగున ఆ యూనిట్ కంట్రోల్ బోర్డ్ వద్దకి వెళ్లి వీడియో ప్లే అవ్వకుండా ఆపేశారు.
అసలు ఈ తతంగం అంతా ఎలా జరిగిందని విచారణ చేపట్టిన పోలీసులకి స్థానికంగా ఉండే ఇద్దరు యువకులు అదే రోజు రాత్రి డిజిటల్ బోర్డ్ ని కంట్రోల్ చేసే రూమ్ లోకి ప్రవేశించి తమ సెల్ ఫోన్ లో ఉన్న బూతు వీడియోలో ఆ సైన్ బోర్డ్ మీదకి వచ్చేలా చేశారు.ఈ తతంగం అంతా స్పష్టంగా సిసి టీవీ పుటేజ్ లో కనపడటంతో వారిని కనుగొని అరెస్ట్ చేశారు.