జుట్టు రాలడాన్ని అరికట్టే ఆవాలు.. ఇలా వాడితే మరిన్ని బెనిఫిట్స్!

ఆవాలు( Black mustard ).వీటి గురించి పరిచయం అక్కర్లేదు.

 Mustard Seeds Helps To Get Rid Of Hair Fall! Mustard Seeds, Mustard Seeds Benefi-TeluguStop.com

దాదాపు ప్రతి ఒక్కరి వంటింటి పోపుల పెట్టెలో ఆవాలు కచ్చితంగా ఉంటాయి.రోజూవారీ వంటల్లో ఆవాలను విరివిరిగా వాడుతుంటారు.

ఆరోగ్య‌ పరంగా ఆవాలు అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.అలాగే జుట్టు సంరక్షణకు కూడా ఆవాలు అద్భుతంగా ఉపయోగపడతాయి.

ముఖ్యంగా జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు ఆవాలు ఉత్తమంగా సహాయ పడతాయి.మరి ఇంతకీ హెయిర్ ఫాల్ స‌మ‌స్య‌ను నివారించుకునేందుకు ఆవాలను ఎలా ఉపయోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆవాలు, రెండు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek ) వేసుకుని మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.ఈ పౌడర్ లో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, వన్ టేబుల్ స్పూన్ ఆముదం మరియు వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Care, Care Tips, Fall, Pack, Latest, Mud Seeds-Telugu Health

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది.కుదుళ్ళు సూపర్ స్ట్రాంగ్ గా మారతాయి.

హెయిర్ ఫాల్ సమస్యకు అడ్డుకట్ట వేయడానికి ఈ రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది.

Telugu Care, Care Tips, Fall, Pack, Latest, Mud Seeds-Telugu Health

అలాగే ఈ హెయిర్ ప్యాక్ ను వారానికి ఒకసారి వేసుకుంటే చుండ్రు సమస్య( Dandruff ) మీ దరిదాపుల్లో కూడా ఉండదు.జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది.మరియు కురులు త్వరగా తెల్లబడకుండా సైతం ఉంటాయి.

కాబట్టి హెయిర్ ఫాల్ తో సతమతం అయ్యేవారు ఈ రెమెడీని తప్పకుండా పాటించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube