రోడ్డుపక్కన ఉండే చెట్లకు తెల్ల రంగు ఎందుకు పూస్తారు? దీని వెనుక తెలియని కారణముందా?

మీరు రోడ్డు లేదా హైవే పక్కన ఉండే చెట్లను చూసి ఉంటారు.ఆ చెట్టు కాండపు భాగానికి తెల్ల రంగు ఉండటాన్ని చూసేవుంటారు.

 Why Are Road Side Trees Painted White Science Reason Head Colour, White Colour ,-TeluguStop.com

చెట్లకు తెల్ల రంగు ఎందుకు వేస్తారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి దీని వెనుక సైన్స్ ఉంది.సున్నంతో చెట్లకు పెయింటింగ్ వేయడం వాటి భద్రతకు సంబంధించినది.

ఇది చెట్లను ఎలా ప్రభావితం చేస్తుందంటే.శాస్త్రీయంగా చెట్లకు తెల్ల రంగు వేయడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి.

వాటికి రంగులు వేయడానికి సున్నం వినియోగిస్తారు.దీనివల్ల చెట్టుకు చెదపురుగులు పట్టవు.

చెట్టు చక్కగా పెరుగుతుంది.చెట్టు కాండంలోని బయటి పొరను రక్షించడానికి సున్నం పనిచేస్తుంది.

బయటి పొరపై సున్నం పూసినప్పుడు, దాని బెరడు పగలదని నిపుణులు చెబుతున్నారు.

కార్నెల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధన ప్రకారం.

పాంటింగ్‌లో ఉపయోగించే తెలుపు రంగు సూర్యుడి ప్రత్యక్ష కిరణాల వల్ల దెబ్బతిన్న కొత్త ఫోలికల్స్‌ను రక్షిస్తుంది.తెలుపు రంగు కారణంగా కొత్త రెమ్మలకు నష్టం జరిగే ప్రమాదం తగ్గుతుంది.

చెట్లకు తెలుపు రంగు వేయడానికి మరో కారణం కూడా ఉంది.తెలుపు రంగు పెయింటింగ్ కలిగిన ఈ చెట్లు వీధి లైట్లు లేని సమయంలో కూడా దారి చూపుతాయి.

చీకట్లో వాటిపై వెలుగు పడగానే రోడ్డు ఎంత విశాలంగా ఉందో అర్థమవుతుంది.కార్నెల్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు ఈ విషయమై మాట్లాడుతూ చెట్లకు పెయింట్ చేయడానికి ఎప్పుడూ ఆయిల్ పెయింట్ ఉపయోగించకూడదన్నారు.

ఇది చెట్ల పెరుగుదలపై చెడు ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.సున్నం ఉపయోగించినట్లయితే చెట్లకు ఎటువంటి హాని జరగదని తెలియజేశారు.

Why White Painting on Trees Beside Roads

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube