పవన్ నాయకత్వ పటిమ కు తొలి పరీక్షగా టీబీజేపీతో పొత్తు?

నిజానికి వ్యాపారంలోనైనా వ్యవహారంలోనైనా డీల్ చేయటం అన్నది అందరికీ సాధ్యమయ్యే పని కాదు .నిజానికి చాలా డీల్స్ లో ఏకపక్షంగా ఒకరికి మాత్రమే లాభం కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి.

 Alliance With T Bjp As The First Test Of Pawan's Leadership Skills, Pawan Kalya-TeluguStop.com

అయితే ఇరుపక్షాల వారు పూర్తిస్థాయి సమర్ధులు అయితే తప్ప విన్/ విన్ ఫార్ములా సాదారణం గా వర్కౌట్ కాదు.అయితే పార్టీ పెట్టి పది సంవత్సరాలు అయినా కూడా కొన్ని రకాల రాజకీయ వ్యవహారాలలో పెద్దగా అనుభవం లేని జనసేన తొలిసారి రెండు విభిన్నమైన పార్టీలతో పొత్తు చర్చలను డీల్ చేస్తుంది .పైగా రెండు పార్టీలు కూడా ఆషా మాషీ పార్టీలు కాదు .దేశ రాజకీయాల్లో అనేక ఢక్కా మొక్కీలు తిని అనేక కీలక పరిణామాలను ఎదుర్కొన్న పార్టీలే.జాతీయ స్థాయిలో ఒకటి ప్రాంతీయ స్థాయిలో ఒకటి అనేక ఎత్తుపల్లాలని చవిచూసిన పార్టీలు.ఇలాంటి అనేక పొత్తు వ్యవహారాలలో ఆ పార్టీలకు అపార అనుభవం ఉంది.

Telugu Amit Shah, Cpm, Jana Sena, Kishan Reddy, Pawan Kalyan, Bjp-Telugu Politic

జనసేన( Jana sena ) మొదటిసారి ఈ రెండు పార్టీలతోనూ పొత్తు చర్చలు చేస్తుంది.ప్రాథమికంగా తెలంగాణలో 32 స్థానాలలో పోటీ చేయాలని నిర్ణయించుకున్న జనసేన, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy )తో భేటీ తర్వాత ఆలోచన వాయిదా వేసుకుంది .ఉమ్మడి పోటీలో కొన్ని స్థానాలను బాజాపాకు త్యాగం చేయాలని అంతిమంగా కొన్ని గౌరవప్రదమైన సీట్లలో పోటీ చేయాలని జనసేన అధిష్టానం భావిస్తుంది.ఢిల్లీ నాయకులతో కూడా పవన్ భేటీ అయి వచ్చారు.

రానున్న ఒకటి రెండు రోజుల్లో బిజెపి తో జనసేన పొత్తు చర్చలు పూర్తయి మూడవ లిస్టు వస్తుందని తెలుస్తుంది.పొత్తు లో బాగం గా జనసేన సాధించిన సీట్ల సంఖ్యను బట్టి ఆ పార్టీ ఎంత ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తుంది అన్నది ఒక అంచనాకు రావచ్చు.

Telugu Amit Shah, Cpm, Jana Sena, Kishan Reddy, Pawan Kalyan, Bjp-Telugu Politic

తద్వారా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పొత్తులు కూడా ఏ రకంగా సాగుతాయో ముందే ఒక అంచనాకు వచ్చే అవకాశం కనిపిస్తుంది .ఇంతకాలం పార్టీని తన భుజం స్కందాలపై మోసుకొచ్చిన పవన్ ఇప్పుడు అత్యంత కీలకమైన సమయంలో తనదైన శైలిలో వ్యవహారాన్ని డీల్ చేయగలిగితేనే జనసేన కు కీలకమైన స్థానాలతో పాటు అధికారంలో వాటా దక్కే అవకాశం ఉంది.లేకపోతే కమ్యూనిస్టు పార్టీల మాదిరి ఒక తోక పార్టీగా జనసేన మారిపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది .మరి జనసేన పార్టీ ని పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ముంచుతారో తేల్చు తారో చూడాలి .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube