సమంత దెయ్యం కథ?

రీసెంట్ గా ఓ బేబీ సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న సమంత నెక్స్ట్ సినిమాపై సరైన క్లారిటీ ఇవ్వలేదు.

ప్రస్తుతం ఆమె తమిళ్ రీమేక్ 96 లో నటిస్తోంది.

ఇక మళ్ళీ ఓ బేబీ దర్శకురాలు నందిని రెడ్డి డైరెక్షన్ లొనే మరో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇక సురేష్ బాబు ప్రొడక్షన్ లో కూడా సమంత మరో సినిమాను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తోంది.

అసలు మ్యాటర్ లోకి వస్తే.బేబీకి ఇటీవల ఒక హారర్ కథ ఎదురైనట్లు సమాచారం.ఒక యువ దర్శకుడు చెప్పిన భయానక దెయ్యం కథ అమ్మడికి తెగ నచ్చేసిందట.

అయితే ఆ సినిమాను సొంత ప్రొడక్షన్ హౌస్ లో నిర్మించాలని బేబీ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.ఆ కథలో సమంత దెయ్యం పాత్రలో కనిపించనుందట

Advertisement

భర్త నాగ చైతన్యతో కలిసి ఒక బ్యానర్ ను స్టార్ట్ చేయనున్నట్లు గతంలో టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.అయితే మొదటి సినిమా స్ట్రాంగ్ గా ఉండాలని బడ్జెట్ విషయంలో ఏ మాత్రం ఆలోచించకుండా హారర్ కథను ఎంచుకుందట.ఇంకా ఈ విషయంపై ఫైనల్ ఎనౌన్స్మెంట్ రావాల్సిఉంది.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!
Advertisement

తాజా వార్తలు