ప్రభాస్ లేకుండానే సలార్ 2 షూటింగ్.. విడుదల అయ్యేది అప్పుడేనా?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas ) డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో నటించిన చిత్రం సలార్( Salaar ) .ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.

 Prabhas Salaar 2 Shooting Start Soon With Out Prabhas, Prashanth Neel, Salaar 2,-TeluguStop.com

గత ఏడాది డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా థియేటర్లలో సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది.ఇలా థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా సలార్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి అయ్యాయని తెలుస్తుంది.ఇక ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పనులను కూడా ప్రారంభించుకోబోతున్నారని తెలుస్తుంది.

జూన్ మొదటి వారంలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం.ఈ షూటింగ్ షెడ్యూల్లో భాగంగా ప్రభాస్ లేకుండానే ఇతర ఆర్టిస్టులతోనూ ఈ షెడ్యూల్ ప్లాన్ చేశారని సమాచారం.

Telugu Prabhas, Prashanth Neel, Salaar, Shruthi Hassan, Tollywood-Movie

ఇక ఈ షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత తదుపరి షెడ్యూల్లో ప్రభాస్ పాల్గొనబోతున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం ప్రభాస్ కల్కి పనులలో బిజీగా ఉన్నారు జూన్ 27వ తేదీ ఈ సినిమా విడుదల కానుంది.ఈ సినిమా తర్వాత సలార్ 2( Salaar 2 ) షూటింగ్లో పాల్గొనబోతున్నారు.అయితే ప్రశాంత్ ఈ సినిమా కోసం ఎక్కువ సమయం కేటాయించకుండా ఈ సినిమా కోసం  ఎక్కువ గంటలు కష్టపడుతూ తొందరగా షూటింగ్ పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

Telugu Prabhas, Prashanth Neel, Salaar, Shruthi Hassan, Tollywood-Movie

సుమారు 5 నెలలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాది చివరిలోనే సలార్ 2 సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచనలో ఉన్నారట అందుకు తగ్గట్టుగానే ఈయన ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని తెలుస్తుంది.క్వాలిటీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని తక్కువ సమయంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు.ఇక ఈ సీక్వెల్ చిత్రంపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలను కూడా ఏర్పడ్డాయి.ఈ సినిమా వీలైనంత తొందరగా పూర్తి చేసి ప్రశాంత్ ఎన్టీఆర్ సినిమాతో బిజీ కాబోతున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube