ప్రభాస్ లేకుండానే సలార్ 2 షూటింగ్.. విడుదల అయ్యేది అప్పుడేనా?
TeluguStop.com
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas ) డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో నటించిన చిత్రం సలార్( Salaar ) .
ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.గత ఏడాది డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా థియేటర్లలో సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది.
ఇలా థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా సలార్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి అయ్యాయని తెలుస్తుంది.
ఇక ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పనులను కూడా ప్రారంభించుకోబోతున్నారని తెలుస్తుంది.జూన్ మొదటి వారంలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం.
ఈ షూటింగ్ షెడ్యూల్లో భాగంగా ప్రభాస్ లేకుండానే ఇతర ఆర్టిస్టులతోనూ ఈ షెడ్యూల్ ప్లాన్ చేశారని సమాచారం.
"""/" /
ఇక ఈ షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత తదుపరి షెడ్యూల్లో ప్రభాస్ పాల్గొనబోతున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ కల్కి పనులలో బిజీగా ఉన్నారు జూన్ 27వ తేదీ ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సినిమా తర్వాత సలార్ 2( Salaar 2 ) షూటింగ్లో పాల్గొనబోతున్నారు.
అయితే ప్రశాంత్ ఈ సినిమా కోసం ఎక్కువ సమయం కేటాయించకుండా ఈ సినిమా కోసం ఎక్కువ గంటలు కష్టపడుతూ తొందరగా షూటింగ్ పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.
"""/" /
సుమారు 5 నెలలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాది చివరిలోనే సలార్ 2 సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచనలో ఉన్నారట అందుకు తగ్గట్టుగానే ఈయన ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని తెలుస్తుంది.
క్వాలిటీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని తక్కువ సమయంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు.
ఇక ఈ సీక్వెల్ చిత్రంపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలను కూడా ఏర్పడ్డాయి.
ఈ సినిమా వీలైనంత తొందరగా పూర్తి చేసి ప్రశాంత్ ఎన్టీఆర్ సినిమాతో బిజీ కాబోతున్నారని తెలుస్తోంది.
కజకిస్థాన్ విమానం క్రాష్ తర్వాత లోపల ఏం జరిగిందంటే? వీడియో వైరల్