టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ ఆయన భార్య వితికా షేరు( Vithika Sheru ) గురించి మనందరికీ తెలిసిందే.ఈ జంట పడ్డానండీ ప్రేమలో మరి అనే సినిమాలో జంటగా నటించారు.
ఈ మూవీ షూటింగ్ సమయంలోనే ప్రేమించుకున్న ఈ జంట పెద్దలను ఒప్పించి మరి 2016లో మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు.అప్పటి నుంచి వితికా ఇండస్ట్రీకి దూరం అయ్యింది.
అలాగే కపుల్ తెలుగు బిగ్‌బాస్ మూడో సీజన్‌లోనూ పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.కానీ ఆ సమయంలో వితికాపై విపరీతమైన నెగెటివిటీ వచ్చింది.
ఆ వ్యతిరేకతను చూసిన వితిక చాలాకాలం పాటు డిప్రెషన్‌లో ఉండి పోయింది.
ఆ తర్వాత దాని నుంచి బయటకు వచ్చి యూట్యూబర్‌గా మారి సరికొత్త జర్నీని మొదలు పెట్టింది.ఇటీవల కాలంలో వితికా అలాగే వరంలో ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.ఇకపోతే వితికా, వరుణ్ లకు ఎప్పుడూ ఎదురయ్యే ప్రశ్న పిల్లల్నెప్పుడు కంటారు? ఎనిమిదేళ్లుగా ఈ క్వశ్చన్ వినీవినీ విసిగెత్తిపోయింది వితిక.అందుకు సంబంధించిన పలు విషయాలను ఆమె తొలిసారిగా ఒక ఇంటర్వ్యూలో ఇలా రియాక్ట్ అయింది.పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం.మా ఫ్యామిలీ లోని చిన్న పిల్లలను అందరినీ నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను.నాకు పిల్లలను కనడానికి ఎలాంటి ఇబ్బంది లేదు.
2016లో పెళ్లైన తర్వాత మేము అమెరికా( America )లో సెటిల్ అయిపోవాలని అక్కడకు వెళ్లాం.అక్కడే కొంతకాలం ఉన్నాము.ఈ క్రమంలో 2018లో నేను ప్రెగ్నెంట్ అయ్యాను.ఆ సమయంలో మా కుటుంబ సభ్యులందరికీ చెప్పేశాం.సంబరాలు చేసుకున్నాం.కానీ, కొద్దిరోజుల్లోనే గర్భస్రావం అయింది.
ఆ తర్వాత నేను ఇండియాకు వచ్చేశాము.ఇక్కడకు వచ్చాకా రెండు నెలలు పీరియడ్స్ రాకపోవడంతో మరోసారి ఆస్పత్రికి వెళ్తే ప్రెగ్నెంట్ అని డాక్టర్స్ చేప్పారు.
అప్పుడు నేను షాక్ అయ్యాను.కొద్దిరోజుల క్రితమే గర్భస్రావం అయిన విషయాన్ని చెప్పాను.
అప్పుడు డాక్టర్ స్కానింగ్ చేయడంతో బేబీ చిన్న ముక్క లోపలే ఉండిపోయిందని చెప్పారు.మరోసారి అబార్షన్ చేసి గర్భ సంచి అంతా క్లీన్ చేశారు అని చెబుతూ వితికా ఎమోషనల్ అయింది.
ఈ సంఘటన జరిగిన తర్వాత తామిద్దరం బిగ్ బాస్( Big Boss )కు వెళ్లడం ఆ తర్వాత పలు ప్రాజెక్ట్‌లతో మళ్లీ ఫైనాన్సియల్‌గా సెటిల్ కావడం జరిగింది అని ఆమె తెలిపింది.దేవుడు కరుణిస్తే పిల్లిలు వద్దనుకునేవాళ్లు ఎవరుంటారు అని ఆమె చెప్పింది.
నిజంగానే తమ జీవితంలోకి ఆ క్షణం వస్తే అందరికీ తప్పకుండా చెప్తానని వితికా చెప్పుకొచ్చింది.వితికా ఇప్పుడు తమ ఫ్యామిలీలో వరుణ్‌తో పాటుగా తను కూడా ఒక ఫ్యామిలీ స్టార్‌గా ఉంది.
రీసెంట్‌గా తన చెల్లి పెళ్లి కూడా చేసింది.సొంతంగా ఇల్లు నిర్మించుకుంది.