మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు మెగా కాంపౌండ్ నుంచి ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు అడుగుపెట్టగా ఈ కాంపౌండ్ నుంచి హీరోయిన్ గా నిహారిక మాత్రమే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఇలా మెగా ఆడపడుచు ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడానికి మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.
దీంతో ఈమె సినిమాలను పెద్దగా ఆదరించలేకపోవడంతో నిహారిక హీరోయిన్ గా ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయారు.ఇలా హీరోయిన్ గా రాణించలేకపోవడంతో ఈమె పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేసుకుని తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.

ఇక సినిమా కుటుంబంలో పుట్టిన నిహారికకు సినిమాల పిచ్చి ఏమాత్రం తగ్గకపోవడంతో ఈమె హీరోయిన్ గా కాకుండా నిర్మాతగా మారి పలు వెబ్ సిరీస్లను నిర్మిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.ఇక నిహారిక హ్యాపీ వెడ్డింగ్ అని సినిమా చేస్తున్న సమయంలో చాలామంది నిహారికకు చాలా తలపోగురు ఎక్కువగానే చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది అంటూ పెద్ద ఎత్తున తనని ట్రోల్ చేశారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నిర్మాత ఏయం రత్నం కుమారుడు, నటుడు సుమంత్ అశ్విన్ నిహారిక గురించి పలు విషయాలు తెలియజేశారు.

అందరూ నిహారికను ట్రోల్ చేసిన విధంగా తనకు నిజంగానే తల పొగరు ఎక్కువ అనే ప్రశ్న ఈయనకు ఎదురు కావడంతో ఈయన సమాధానం చెబుతూ అసలు నిహారిక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్ అని ఇగో ఏమాత్రం లేదని తాను చాలా అల్లరి చేస్తూ గోలగోల చేస్తూ లోకేషన్ మొత్తం సందడి చేస్తూ ఉంటారని సుమంత్ అశ్విన్ తెలిపారు.నిహారికకు మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీఈమె మాత్రం చాలా సరదాగా అందరితో ఓ సాధారణ వ్యక్తి లాగా కలిసిపోతారు అంటూ ఈయన నిహారిక గురించి వస్తున్నటువంటి వార్తలు పూర్తిగా తప్పు అంటూ కొట్టి పారేశారు.దీంతో ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







