న్యాచురల్ స్టార్ నాని సినిమాలు అంటే ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా ఇష్టం.ఇక నాని తన కెరీర్ లో ఒక సినిమా ముగియకుండానే మరో సినిమా ప్రకటిస్తాడు అనే విషయం తెలిసిందే.
నాని సినిమాలు ఎంత త్వరగా ప్రకటిస్తాడో అంతే త్వరగా పూర్తి కూడా చేస్తాడు. ప్రజెంట్ నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ”దసరా” సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా మార్చి 30, 2023 లో భారీ స్థాయిలో పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
ఇక ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా రిలీజ్ కాకుండానే నాని మరో కొత్త సినిమా స్టార్ట్ చేసాడు.నాని కెరీర్ లోనే బెంచ్ మార్క్ సినిమా 30వ ప్రాజెక్ట్ కూడా షూట్ కు రెడీ అయ్యింది.

ఇటీవలే హైదరాబాద్ లో గ్రాండ్ గా ముహూర్తం జరుపుకుని స్టార్ట్ అయ్యింది.ఈ సినిమాను కొత్త డైరెక్టర్ శౌర్యన్ తెరకెక్కిస్తుండగా మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో నానికి జంటగా కనిపిస్తుంది.ఈ సినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా.హీషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నాడు.మరి నాని ఈ రెండు సినిమాలను పూర్తి చేయకుండానే మరో సినిమాను కూడా ఫిక్స్ చేసుకున్నాడు అని క్రేజీ టాక్ బయటకు వచ్చింది.

అది కూడా అంటే సుందరానికి వంటి సినిమాను చేసిన వివేక్ ఆత్రేయ తో అని తెలుస్తుంది.ఈ సినిమా కలెక్షన్స్ పరంగా ఆకట్టుకోలేక పోయిన కూడా ప్రేక్షకులను బాగానే అలరించింది.దీంతో నాని మరోసారి ఈ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చినట్టు టాక్.
ఈ రూమర్స్ లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ నాని 31 ఫిక్స్ అనే టాక్ బలంగా వినిపిస్తుంది.చూడాలి ఈ కాంబో రిపీట్ అవుతుందో లేదో.







