Naga Shaurya : క్యాచీ టైటిల్ పట్టేసిన నాగశౌర్య.. రెండు సూపర్ హిట్ సినిమాల ఇన్స్పిరేషన్ తో..

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నాగ శౌర్య ఒకరు.ప్రస్తుతం నాగ శౌర్య వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

 Naga Shaurya's Next Project Interesting Title Fix, Naga Shaurya, Next Project, I-TeluguStop.com

సినిమా సినిమాకు క్రేజ్ పెంచుకుంటూ దూసుకు పోతున్నాడు.లుక్ పరంగా కూడా నాగ సౌర్య అదుర్స్ అనిపిస్తున్నాడు.

ఇక ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాడు అయ్యాడు.ఇక మళ్ళీ వెంటనే సినిమాల్లో బిజీ అయ్యాడు.

ఈ మధ్యనే నాగశౌర్య అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో కృష్ణ వ్రింద విహారి సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమాలో షెర్లీ సెటియా హీరోయిన్ గా నటించింది.

గత సినిమాలు ప్లాప్ అవ్వగా ఈ సినిమా మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఐరా క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుని పాజిటివ్ రెస్పాన్స్ తో బాగానే కలెక్షన్స్ రాబట్టింది.

ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టాడు.ఇక శౌర్య ముందు నుండి తన సినిమాలకు క్యాచీ టైటిల్స్ నే పెట్టుకుంటూ వస్తున్నాడు.

ఇక ఇప్పుడు చేయబోయే సినిమాకు కూడా క్యాచీ టైటిల్ పెట్టినట్టు తెలుస్తుంది.ప్రెజెంట్ ఈయన చేస్తున్న సినిమా టైటిల్ ‘రంగబలి‘ అని ఖరారు చేసినట్టు తెలుస్తుంది.రంగబలి అనే టైటిల్ ను రెండు సూపర్ హిట్ సినిమాల యొక్క టైటిల్స్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని పెట్టినట్టుగా తెలుస్తుంది.

Telugu Naga Shaurya, Nagashauryas, Project, Ranabali-Movie

మరి ఆ రెండు సినిమా మొత్తానికి నాగ శౌర్య సినిమా ఫలితం ఏమో కానీ రంగబలి టైటిల్ తోనే నాగ శౌర్య అందరి దృష్టిని ఆకర్షించడం ఖాయం అన్నట్టుగా ఫ్యాన్స్ అంటున్నారు.ఈ సినిమా కోసం నాగశౌర్య ముందు కంటే ఎక్కువగానే కష్టపడుతున్నాడు అని టీమ్ చెబుతుంది.ప్రెజెంట్ ఈ షూట్ ను రామోజీ ఫిలిం సిటీలో భారీగా ఖర్చు చేసి వేసిన సెట్టింగ్ లో మెజారిటీ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube