జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) గురించి మనందరికీ తెలిసిందే.నందమూరి వారసుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న విషయం తెలిసిందే.
గత ఏడాది విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారారు.ఇకపోతే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి.ఇక ఆ సంగతి అటు ఉంచితే ఎన్టీఆర్ కు టాలీవుడ్( Tollywood ) తో పాటు పాన్ ఇండియా లెవెల్ లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే.మరి ముఖ్యంగా తారక్ తన నటనతో మంత్రముగ్ధుల్ని చేశారు.
ఇది ఇలా ఉంటే ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనిల్ శర్మ ( Bollywood director Anil Sharma )తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.ఈ సందర్భంగా అనిల్ శర్మ చేసిన వాఖ్యలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

గదర్ ( Gadar )సినిమాను నేటి తరం హీరోలతో చేయాల్సి వస్తే.ఎవరితో చేస్తారు అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.తారాసింగ్ పాత్రకు న్యాయం చేయగలిగే యువ హీరోలు బాలీవుడ్‌లో లేరు.దక్షిణాదిలో చాలా మంది ఉన్నారు.ముఖ్యంగా ఎన్టీఆర్ అయితే ఈ పాత్రకు సరైన న్యాయం చేయగలరు అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ ఆ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు.
ఇది కదా ఎన్టీఆర్ అంటే అని కొందరు కామెంట్ చేయగా దటీజ్ ఎన్టీఆర్ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఎన్టీఆర్ పేరు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.







