బీఆర్ఎస్ పేరుతో కొత్త జాతీయ పార్టీని ఏర్పాటు చేసి దేశ రాజకీయాల్లో సరికొత్త మార్పులు తీసుకొస్తానంటూ ప్రకటనలు చేస్తున్న కేసీఆర్ కు ఇప్పుడు తన కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇరుక్కోవడం తలనొప్పిగా మారింది.కేంద్ర అధికార పార్టీ బిజెపిని పూర్తిగా టార్గెట్ చేసుకుని, విమర్శలతో విరుచుకుపడుతూ , రాబోయే లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్న కేసీఆర్ కు కవిత కేసుల వ్యవహారం స్పీడ్ బ్రేకర్ గా మారబోతోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఎమ్మెల్సీ కవితే అసలు సూత్రధారి అన్నట్లుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో స్పష్టంగా వెల్లడించింది.ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసిన ఇండో స్పిరిట్ కంపెనీకి యజమాని కవితేనని స్పష్టంగా చార్జిషీట్ లో పేర్కొంది.
ఈ కేసులో ఉన్న శరత్ రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి తో కలిసి కవిత ఈ వ్యాపారం చేపట్టారని అరుణ్ రామచంద్ర పిళ్లే ను బినామీగా పెట్టుకున్నట్లు ఈడి పేర్కొంది.మొత్తం ఈ వ్యవహారంలో కీలక పాత్ర అంత కవితదే అని ఈడి దాఖలు చేసిన చాట్ సీట్ లో పేర్కొనడంతో , ఆమె ఈ వ్యవహారంలో పూర్తిగా ఇరుక్కుపోయినట్లేనని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంపై ఈడి దాఖలు చేసిన 181 పేజీల చార్జిషీట్ లో 28 సార్లు కవిత పేరు ప్రస్తావించారు.

ఈ లిక్కర్ స్కాం లో కవితతో పాటు , మాగుంట రాఘవరెడ్డి , శరత్ రెడ్డి నిర్వహిస్తున్న సౌత్ గ్రూప్ ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించినట్లుగా అప్రూవర్ గా మారిన దినేష్ ఆరోరా స్పష్టంగా ఈడి అధికారులకు చెప్పేశారు.ఢిల్లీ , హైదరాబాద్ స్టార్ హోటల్ లో అనేకసార్లు వీరు సమావేశమైనట్లు కవిత అనేకసార్లు ఫేస్ టైం ద్వారా నిందితులతో మాట్లాడి కలిసి వ్యాపారం చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేసినట్లుగా ఈడి తన చార్జిషీట్ లో పేర్కొంది.అంతేకాదు ఢిల్లీ లిక్కర్ స్కాం లో దక్షిణాది నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొంతమంది నాయకులకు హవాలా మార్గంలో ముడుపులు అందినట్లుగా పేర్కొంది.
పూర్తిగా ఈ లిక్కర్ స్కాం లో ప్రధాన పాత్ర అంతా కవితదేనని తేల్చిన నేపథ్యంలో త్వరలోనే ఈ వ్యవహారంలో కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.







