క్యాసినో వ్యవహారం కేసులో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది.కేసు విచారణలో భాగంగా మంత్రి తలసాని కుమారుడు సాయికిరణ్ కు ఈడీ అధికారులు నోటీసులు అందించనున్నారు.
ఈ మేరకు నోటీసులు ఇచ్చేందుకు ఈడీ అధికారులు వెళ్లగా వాటిని తీసుకునేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించినట్లు సమాచారం.దీంతో తదుపరి చర్యలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కసరత్తు చేస్తోంది.
కాగా ఈడీ అధికారులు వెళ్లిన సమయంలో సాయికిరణ్ ఇంటిలో లేనట్లు తెలుస్తోంది.అయితే ఇప్పటికే ఈ కేసులో తలసాని సోదరులను ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే.