బిగ్ బాస్ కార్యక్రమం 11వ వారంలో భాగంగా నామినేషన్స్ లో ఉన్నటువంటి ఎనిమిది మంది నుంచి మెరీనా ఔట్ అయ్యారు.11వ వారంలో భాగంగా డేంజర్ జోన్ లో ఇనయ, మెరీనా ఉండగా చివరికి మెరీనా ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.ఈ విధంగా మెరీనా ఎలిమినేట్ కావడంతో ఈమె భర్త రోహిత్ ఎంతో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.11 వారాలపాటు హౌస్ లో కొనసాగుతూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నటువంటి మెరీనా ఎలిమినేట్ కావడంతో హౌస్ సభ్యులు సైతం ఎమోషనల్ అయ్యారు.
ఇకపోతే ప్రతి సీజన్లోనూ బిగ్ బాస్ సెలబ్రిటీలను పంపిస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ సీజన్లో భాగంగా మెరీనా రోహిత్ దంపతులను హౌస్ లోకి పంపించారు.
మొదట్లో వీరిద్దరిని ఒకరిగానే భావించాలని చెప్పిన బిగ్ బాస్ అనంతరం వీరిద్దరిని వేరువేరుగా విభజించారు.మొత్తానికి 11 వారాలు కొనసాగిన మెరీనా బయటకు రావడంతో ఈమె బిగ్ బాస్ నుంచి ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయంపై ఆసక్తి నెలకొంది.
టీవీ సీరియల్స్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకోవడంతో ఈమె వారానికి 2లక్షల రెమ్యూనరేషన్ అగ్రిమెంట్ కుదుర్చుకొని వెళ్లారట.ఈ క్రమంలోనే 11 వారాలకు గాను ఈమె 22లక్షలకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తుంది.మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఇదే కనుక నిజమైతే బిగ్ బాస్ ద్వారా మెరీనా భారీగానే సంపాదించుకుందని తెలుస్తుంది.