హైదరాబాద్ నగరంలో చుడీదార్ గ్యాంగ్( Chudidar gang ) తీవ్ర కలకలం సృష్టిస్తుంది.చెడ్డీ గ్యాంగ్ తరహాలోనే సరికొత్తగా చుడీదార్ గ్యాంగ్ దోపిడీలకు పాల్పడుతుంది.
ఈ క్రమంలోనే ఎస్ఆర్ నగర్( SR Nagar) లో చుడీదార్ గ్యాంగ్ చోరీ చేసింది.ఎస్ఆర్ నగర్ కు సమీపంలోని జెట్ కాలనీలోని అపార్ట్ మెంట్ లో దోపిడీకి పాల్పడ్డారు.
వెంకటేశ్వర రావు అనే వ్యక్తి ఇంటిలో నాలుగు తులాల బంగారంతో పాటు రూ.లక్ష నగదు, ల్యాప్ టాప్ ను ఎత్తుకెళ్లారు.బాధితుని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీ(CCTV footage ) ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.కాగా చుడీదార్ గ్యాంగ్ లో మహిళలతో పాటు పురుషులు కూడా ఉన్నారని తెలుస్తోంది.







