లేడీ పవర్ స్టార్ గా సౌత్ లో ఎంతోమంది ఇమేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి (Sai Pallavi) తల్లిదండ్రులు వాళ్లు కాదా.నిజంగానే సాయి పల్లవిని దత్తత తీసుకున్నారా.
మరి సాయి పల్లవి అసలు తల్లిదండ్రులు ఎవరు.అనే నమ్మలేని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సాయి పల్లవి మలయాళ ప్రేమమ్ సినిమాలో( Premam ) తన నటనతో అదరగొట్టి తెలుగులో వరుణ్ తేజ్ తో ఫిదా మూవీ లో( Fidaa ) మొదటిసారి పల్లెటూరి పిల్లగా తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకొని తెలుగు సినీ ప్రియుల గుండెల్లో భానుమతిగా ముద్ర వేసుకుంది.అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం నాగచైతన్య హీరోగా వస్తున్న తండేల్ (Thandel) అలాగే కోలీవుడ్లో శివ కార్తికేయన్ సరసన మరో మూవీలో చేస్తోంది.
అలాగే బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో కూడా రామాయణం సినిమాలో సీతగా నటిస్తోందని ఇప్పటికే నెట్టింట టాక్ వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమాలు మాత్రమే కాకుండా నవీన్ పోలి (Naveen Poli) తో మాలీవుడ్ లో కూడా ఒక సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది.ఇక ఇదంతా పక్కన పెడితే సాయి పల్లవి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడిన మాటలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.ఇక సాయి పల్లవి కి సంబంధించిన ఆ వీడియోలో ఏముందంటే.
సాయి పల్లవి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన బాల్యం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పింది.
ఆమె మాట్లాడుతూ.చిన్నప్పుడు నేను మా పేరెంట్స్ ని( Sai Pallavi Parents ) చాలా వింత వింత ప్రశ్నలు అడిగి విసిగించేదాన్ని.ఇక ఒకానొక సమయంలో అయితే మా అమ్మ నాన్న ఎందుకు అలా డస్కీ స్కిన్ తో ఉన్నారు నేనెందుకు ఇలా తెల్లగా ఉన్నాను అనే డౌట్ నాకు వచ్చింది.
దాంతో ఆ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి మా పేరెంట్స్ ని డైరెక్ట్ గా వెళ్లి అమ్మ నేను మీకు పుట్టలేదా.నన్ను దత్తత తీసుకున్నారా.ఎందుకు మీ కలర్ అలా ఉంది నా కలర్ ఇలా ఉంది అని అడిగాను.
దానికి మా పేరెంట్స్ ఒక నవ్వు నవ్వి అలాంటిదేమి లేదమ్మా నువ్వు చెల్లి మీరిద్దరూ మాకే పుట్టారు స్కిన్ టోన్ అలా వచ్చింది అంతే అని చెప్పారు.
ఇక ఇవే కాకుండా నేను చిన్నతనంలో ఎన్నో వింత ప్రశ్నలు అడుగుతూ మా వాళ్ళని విసిగించేదాన్ని అంటూ సాయి పల్లవి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.ప్రస్తుతం సాయి పల్లవి (Sai Pallavi) కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.